
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల చట్టసవరణ బిల్లుకు కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యింది. విపక్షాలు బిల్లుకు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 16,17,18 తేదీల్లో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులు హాజరై ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాలని ప్రధాని మోదీ కోరారు.
2029 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని ప్రధాని మోదీ కోరారు. ఏప్రిల్ 16,17,18 తేదీల్లో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు అన్ని పార్టీల ఎంపీలు హాజరు కావాలని మోదీ విజ్ఞప్తి చేశారు. మహిళా బిల్లు ఆమోదానికి ఏకాభిప్రాయ సాధన కోసం – కృషిచేయాలంటూ అన్ని రాజకీయ పక్షాలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఈ మార్పులు భారతదేశవ్యాప్తంగా ఉన్న మహిళల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయని, వీటిని కేవలం శాసనపరమైన ప్రక్రియ అని పిలవడం తక్కువ చేసి చెప్పడమే అవుతుందని అన్నారు. అంతేకాకుండా, ఇది భారతదేశ నాగరికతా స్ఫూర్తికి ఎప్పటినుంచో మార్గదర్శకంగా ఉన్న ఒక సూత్రానికి ధృవీకరణ అని ఆయన అన్నారు.
భారతదేశ జనాభాలో సగం మంది మహిళలేనని, దేశ అభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ, వారి సాధికారత కోసం నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, ఆర్థిక సహాయం అందించడం వల్ల ఆర్థిక, సామాజిక జీవితంలో మహిళల భాగస్వామ్యానికి పునాదులు మరింత బలపడ్డాయని ఆయన అన్నారు. సమాజంలో మహిళల పాత్రకు అనుగుణంగా రాజకీయాలు, శాసనసభలలో వారి భాగస్వామ్యం లేకపోవడం దురదృష్టకరమని ప్రధానమంత్రి
భావితరాల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లు అన్నారు మోదీ. వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే మాతృశక్తిని, నారీశక్తిని పూర్తిస్థాయిలో పటిష్ఠం చేయాలని మోదీ వీడియో సందేశం జారీ చేశారు. ప్రజాస్వామ్యం కాలక్రమేణా మరింత సమ్మిళితం అవుతుందని ఇలాంటి సందర్భాలు చాటిచెబుతాయన్నారు. ఇది సాధారణ శాసన ప్రక్రియ కాదన్నారు. దేశంలో కోట్లమంది మహిళల ఆకాంక్షలకు ప్రతిరూపమని అన్నారు. “కమిటీలు ఏర్పాటు చేశారు, బిల్లు ముసాయిదాలు ప్రవేశపెట్టారు కానీ అవి ఎన్నడూ కార్యరూపం దాల్చలేదు,” అని ప్రధాని మోదీ అన్నారు. “కానీ శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలనే విస్తృత ఏకాభిప్రాయం అలాగే నిలిచి ఉంది. సెప్టెంబర్ 2023లో, పార్లమెంట్ అదే ఏకాభిప్రాయ స్ఫూర్తితో నారీ శక్తి వందన అధినియమ్‌ను ఆమోదించింది. నేను దానిని నా జీవితంలోని అత్యంత ప్రత్యేకమైన సందర్భాలలో ఒకటిగా భావిస్తాను.” అని ప్రధానమంత్రి తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH | Women's Reservation Bill | PM Narendra Modi says, "…India has resolved that by 2047 when we complete 100 years of independence, we must achieve goal of Viksit Bharat. But from my experience of being the Head of Government for the past two-and-a-half decades, I can say… pic.twitter.com/8NGPs0KFUC
— ANI (@ANI) April 9, 2026
ఇదిలావుంటే, 2023లో కూడా పార్లమెంట్ ఉభయసభలు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాయి. లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 816కి పెంచి, వాటిలో 273 స్థానాలను మహిళలకు కేటాయించడానికి వీలుగా మహిళా రిజర్వేషన్ చట్టంలో మార్పులు చేస్తున్నారు. 2011 జనాభా ఆధారంగా మహిళకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును తెస్తోంది. బిల్లులో కొన్ని మార్పులు చేయాలని విపక్షాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఓబీసీ , ముస్లిం, ఎస్సీ,ఎస్టీ వర్గాల మహిళలకు కోటా కల్పించాలని కోరుతున్నాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసంపై కాంగ్రెస్ పార్టీ కూడా కీలక చర్చలు జరుపుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 10) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్‌పై చర్చిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
