నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు ఎప్పుడూ గెలవాలని, అందరి కంటే ముందుండాలని ఒత్తిడికి గురవుతుంటారు. ఓటమి ఎదురైన ప్పుడు వారు కుంగిపోకుండా ఉండాలంటే..

శ్రమను గుర్తించండి:
మార్కుల కంటే లక్ష్యం కోసం వారికష్టాన్ని, అంకితభావాన్ని మెచ్చుకోండి. ‘నువ్వు ఈ రోజు గెలవ కపోవచ్చు, కానీ నీ శ్రమ నాకు చాలా గర్వంగా అనిపించింది” అనే ఒక్క మాట వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
విమర్శించవద్దు:
ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఓడిపోయినప్పుడు మందలించడం వల్ల వారు భవిష్యత్తులో కొత్త పనులు చేయడానికి భయపడతారు. దానికి బదులుగా “ఎక్కడ తప్పు జరిగింది? ఎలా మెరుగుపరుచుకోవచ్చు?’ అని చర్చించండి.
ప్రత్యర్థిని అభినందించడం:
మనం ఓడిపోయినప్పుడు ప్రత్యర్థిని అభినందించడం అనేది గొప్ప సంస్కారం. ఇది వారిలో అసూయను తగ్గించి, పక్కవారి పట్ల గౌరవాన్ని పెంచుతుంది.
సహజత్వం:
ఆటల్లో గెలుపోటములు సహజమని, ఈ రోజు ఓడితే రేపు గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పాలి.
రోల్మెడల్:
పిల్లలు మీరు చెప్పే మాటల కంటే, మీరు చేసే పనులనే ఎక్కువగా గమనిస్తారు. మీరు ఓటమిని ధైర్యంగా స్వీకరిస్తే, వారు కూడా అదే బాటలో నడుస్తారు.
ఎమోషనల్ సపోర్ట్:
ఓడిపోయినప్పుడు పిల్లలు బాధపడటంసహజం. ఆ బాధను తక్కువ చేయకుండా ‘నీకు బాధగా ఉందని నాకు తెలుసు, పర్వాలేదు’ అని వారిని దగ్గరకు తీసు కోండి. వారి భావాలను గౌరవిస్తూనే, ఆ పరిస్థితి నుంచి బయ టకు వచ్చి మళ్లీ ప్రయత్నించేలా ప్రోత్సహించాలి.
