భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలపై స్పెషల్ ఫోకస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. పేదల కోసం ఉద్దేశించిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. సాధారణంగా రేషన్ బియ్యం రవాణా చేసే లారీలకు జీపీఎస్ ట్రాకర్లు అమరుస్తారు. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమార్కులు లారీకి బదులుగా బైక్‌కు జీపీఎస్ అమర్చి అధికారులను ఏమార్చారు. ఈ విధంగా మల్లారం ఏఎంసి గోదాం నుంచి పాల్వంచ ఎంఎల్ఎస్ పాయింట్‌కు…
