తాజావార్తలు

కీళ్ల నొప్పులకు చిట్కాలు:

ఇంట్లోనే Joint Pain తగ్గించే సులభ మార్గాలు

చలికలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కీర్ణ తీగుసుకుపోయి నొప్పులు రావడం రాజం. ఈ సీజనల్ ఇబ్బందులను తొలగించి, మీ కీళ్లకు మునుపటి బలాన్నిచ్చే ‘సూపర్ ఫుడ్స్’ ఇవే.https://a2zchronicle.com/

పసుపు: ఇందులో ఉండే ‘కర్కుమిన్’ వాపులను తగ్గిస్తుంది. రాత్రిపూట పసుపు కలిపిన పాలు తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.https://www.youtube.com/watch?v=nmP1eTF1qs8

అల్లం: ఇది సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. అల్లం టీ తాగడం వల్ల, లేదంటే వంటల్లో అల్లం వాడటం ద్వారా కీళ్ల వాపులను తగ్గించుకోవచ్చు.

ఆవకూర: విటమిన్-కె, కాల్షియం మెండుగా ఉండే ఈ ఆకుకూర ఎముకల మృదులాస్థిని కాపాడుతుంది.

నువ్వులు: కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే నువ్వులు ఎముకల సాంద్రతను పెంచి కీళ్లకు బలాన్నిస్తాయి.

ఉసిరి: విటమిన్-సి పుష్కలంగా ఉండే ఉసిరి కణజాలాల మరమ్మతుకు, కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

మెంతులు: యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్న మెంతులు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.

నెయ్యి: పరిమితంగా నెయ్యి తీసుకోవడం వల్ల అది కీళ్లకు లూబ్రికెంట్గా పనిచేసి కదలికలను సులభతరం చేస్తుంది.

రాగులు: కాల్షియం ఎక్కువగా ఉండే రాగులు ఎముకలను దృఢంగా ఉంచి కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తాయి.

సరళంగా చెప్పాలంటే

✅ కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే ఈ 5 ముఖ్యమైన చిట్కాలు.

ముఖ్యంగా

1️⃣ సరైన ఆహారం తీసుకోవాలి

కీళ్ల నొప్పులు తగ్గాలంటే కాల్షియం, విటమిన్ D, ప్రోటీన్ ఉన్న ఆహారం తప్పనిసరి.
👉 పాలు, పెరుగు, ఆకుకూరలు, బాదం, చేపలు, గుడ్లు తినడం చాలా మంచిది.


2️⃣ రోజూ వ్యాయామం చేయాలి

నడక, యోగా, స్ట్రెచింగ్ వ్యాయామాలు కీళ్లను బలంగా ఉంచుతాయి.
👉 రోజుకు కనీసం 20–30 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి.


3️⃣ బరువు నియంత్రణ చాలా ముఖ్యం

అధిక బరువు కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పెడుతుంది.
👉 బరువు తగ్గితే మోకాళ్ల నొప్పులు సహజంగానే తగ్గుతాయి.


4️⃣ ఆయిల్ మసాజ్ & హాట్ కంప్రెస్

నొప్పి ఉన్న చోట వేడి నీటి కంఫ్రెస్ లేదా ఆయిల్ మసాజ్ చేయడం ఉపశమనాన్ని ఇస్తుంది.
👉 ఆవ నూనె, కొబ్బరి నూనె లేదా హర్భల్ ఆయిల్స్ ఉపయోగించవచ్చు.


చివరగా..

5️⃣ డాక్టర్ సలహా తప్పనిసరిhttps://www.youtube.com/watch?v=bg_I2qrm1e0

నొప్పి ఎక్కువ రోజులు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.
👉 స్వయంగా మందులు వాడడం ప్రమాదకరం. కీళ్ల నొప్పులకు చిట్కాలు: ఇంట్లోనే Joint Pain తగ్గించే సులభ మార్గాలు | https://a2zchronicle.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *