తాజావార్తలు

పంటి నొప్పి… పళ్ళు జివ్వున లాగటం… పిప్పిపళ్ళు… చిగుళ్ళ వాపులు

ఈ దంతాల బాధలకు అంతులేదు! ఆ … ఆ బాధా వర్ణనాతీతం! అయితే ఇదేదో ఒకరిద్దరి సమస్య కాదు.

దంత సంరక్షణ గురించి సరైన అవగాహన లోపించటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అక్షరాలా ఐదు వందల కోట్ల మంది రకరకాల దంత సమస్యలతో బాధపడుతున్నారని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఎ) లెక్కగట్టింది.

ఈ లెక్కల ప్రకారం- దంత క్షయం; చిగుళ్ళ వ్యాధులు గొంతు, నోటి క్యాన్సర్ల వంటి ఆరోగ్య సమస్యలు పారిశ్రామిక దేశాల్లోనూ, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఎక్కువగా కనబడుతున్నాయని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

మెరుగైన దంత సంరక్షణ కోసం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇటీవల 38 పేజీల నివేదికను విడుదల చేసింది.

దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలంటే – ప్రజలు నోటి శుభ్రత, దంత సంరక్షణల అవసరాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక ప్రత్యేకంగా సూచించింది.

ఇవి పంటి నొప్పి, పళ్ళు జివ్వున లాగటం, పిప్పిపళ్ళు, చిగుళ్ళ వాపులు గురించి ముఖ్యమైన 10 పాయింట్లు 👇

  1. పంటి నొప్పి ఎక్కువగా పళ్ళలో పుచ్చు (కావిటీ) వల్ల వస్తుంది
  2. చల్లని నీరు, తీపి పదార్థాలు తింటే పళ్ళు జివ్వున లాగటం సాధారణంగా సెన్సిటివిటీ వల్ల
  3. పిప్పిపళ్ళు (విజ్డమ్ టూత్) సరిగ్గా బయటకు రాకపోతే నొప్పి, వాపు వస్తుంది
  4. చిగుళ్ళ వాపులు ఎక్కువగా పళ్ళపై మురికి (టార్టర్) వల్ల కలుగుతాయి
  5. రోజుకు రెండుసార్లు పళ్ళు బ్రష్ చేయడం చాలా ముఖ్యం
  6. ఉప్పు నీటితో నోరు కడుక్కోవడం వాపు తగ్గిస్తుంది
  7. చాలా వేడి, చాలా చల్లని ఆహారం తగ్గించాలి
  8. పొగ త్రాగడం, గుట్కా వంటి అలవాట్లు చిగుళ్ళకు చాలా హానికరం
  9. 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి
  10. తీవ్రమైన నొప్పి లేదా వాపు ఉంటే వెంటనే డెంటిస్ట్‌ని సంప్రదించాలి.

ఇవి పంటి నొప్పి, పళ్ళు జివ్వున లాగటం, పిప్పిపళ్ళు, చిగుళ్ళ వాపుల కోసం ఇంట్లో చేయగల హోమ్ రెమెడీస్ 👇

  1. ఉప్పు నీరు గార్గిల్ – గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి నోరు కడుక్కోవడం వాపు, నొప్పి తగ్గిస్తుంది
  2. లవంగం (Clove) – లవంగం నూనె లేదా లవంగం పంటి మీద పెట్టితే నొప్పి తగ్గుతుంది
  3. వెల్లుల్లి పేస్ట్ – వెల్లుల్లి నూరి పంటి మీద పెట్టితే బ్యాక్టీరియా తగ్గుతాయి
  4. తులసి ఆకులు – తులసి ఆకులు నమిలితే నోరు శుభ్రంగా ఉంటుంది
  5. పసుపు + ఉప్పు – పసుపు, ఉప్పు కలిపి చిగుళ్లపై మర్దన చేయడం వాపు తగ్గిస్తుంది
  6. కొబ్బరి నూనె ఆయిల్ పుల్లింగ్ – 1 స్పూన్ కొబ్బరి నూనె నోట్లో తిప్పి ఉమ్మేయాలి (రోజూ)
  7. అల్లం రసం – అల్లం రసం పంటి మీద పెట్టితే నొప్పి తగ్గుతుంది
  8. చల్లని కంప్రెస్ – బయట నుంచి చెంపపై చల్లని గుడ్డ పెట్టితే నొప్పి తగ్గుతుంది
  9. తీపి, చల్లని పదార్థాలు తగ్గించాలి – ఐస్ క్రీమ్, చాక్లెట్ ఎక్కువగా తినకూడదు
  10. బ్రష్ & ఫ్లోస్ – రోజుకు 2 సార్లు బ్రష్, పళ్ళ మధ్య ఫ్లోస్ చేయాలి

👉 గమనిక: ఇవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే.
నొప్పి ఎక్కువగా ఉంటే లేదా పుస్/వాపు ఉంటే తప్పకుండా డెంటిస్ట్‌ని సంప్రదించాలి.

నోటి శుభ్రత లోపించటం వల్ల వివిధ ఆరోగ్య సమస్య లొస్తున్నాయని,

ఇది జీవన ప్రమాణంపై కూడా ప్రభావం చూపుతోందని డబ్ల్యుహెచ్ఐకు చెందిన గ్లోబల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రతినిధి డా॥ పౌల్ఎరిక్ పీటర్సన్ అభిప్రాయ పడ్డారు. దంత సమస్యల వల్ల వచ్చే నొప్పి, బాధతో- ఆహారం తీసుకోవటం, నమలటంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

రంగు మారిన, దెబ్బతిన్న పళ్ళ వల్ల చాలా మంది రోజువారీ జీవితంలోనూ రకరకాల బాధలు అనుభవిస్తున్నారు. ఇక పళ్ళు ఊడిపోవటం వల్ల అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోలేక కొందరిలో పోషకాహార లోపం ఏర్పడి, అది క్రమంగా ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని గుర్తించారు.

వృద్ధాప్యంలో పళ్ళు వూడిపోవటం సహజమైన విషయమేనని చాలా మంది భావిస్తూ ఉంటారు.

కానీ అది పూర్తి వాస్తవం కాదని, చక్కటి దంత సంరక్షణతో దాన్ని నివారించే వీలుందని నిపుణులు అంటున్నారు.

ఈ పరిస్థితి ఒక్క బడుగు దేశాల్లోనే ఉందనుకుంటే తప్పు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా- పిల్లల్లో 60% నుంచి 90% మందికి, పెద్దవాళ్ళల్లో చాలా మందికి దంత సమస్యలు ఉన్నాయని నివేదిక గుర్తించింది.

కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లోని దంతక్షయాన్ని చాలా వరకూ నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 80% మందిని వివిధ దంతసమస్యలు బాధిస్తున్నాయని ఒక అంచనా. ఎక్కువ మంది పిల్లల్లో కనిపిస్తున్న జింజివైటిస్ (చిగుళ్ళ రక్తస్రావం) – వయస్సు పెరిగిన తర్వాత చిగుళ్ళ వ్యాధిగా మారుతోంది.

ఈ చిగుళ్ళ వ్యాధుల కారణంగానే 5% నించి 15% మందికి పళ్ళు ఊడిపోతున్నాయి. చిగుళ్ళ వ్యాధులు రావటానికి పొగతాగటం కూడా ముఖ్య కారణమని భావిస్తున్నారు.

పొగాకు నమలటం, వక్క తినటం, ముక్కు పొడుం పీల్చటం, పళ్ళను సరిగ్గా శుభ్రపరచుకోక పోవటం, మద్యం సేవించటం లాంటి ఇతర కారణాలు కూడా నోటి, దంత సంబంధ సమస్యలకు కారణాలవుతున్నాయని నివేదిక వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *