బరువు పెరగడం ఎంత తేలికో, తగ్గడం అంత కష్టం. జిహ్వ చాపల్యాన్ని అణుచుకోలేం!

సక్రమమైన జీవనశైలిని అనుసరించలేం! ఫలితంగా శరీరం బరువు అదుపు తప్పుతుంది.
అయితే ఇలా పెరిగిన శరీర బరువును ఆయుర్వేద వైద్య చికిత్సలతో, ఆయుర్వేదం సూచించే నియమాలతో తగ్గించుకోవచ్చు.

సాధారణంగా బరువు పెరగడం ప్రపంచ దేశాలన్నిటిలో కనిపిస్తున్న అత్యంత సాధారణమైన ఆరోగ్య సమస్య. మహర్షి చరకుడు రాసిన చరకసంహితంలో ఈ సమస్యకు మేదోరోగం అనే పేరు ఉంది.
తొడలు, ఉదరం, ఛాతీ మొదలైన శరీర ప్రదేశాల్లో అడిపోజ్ కణజాల పరిమాణం పెరిగి, తద్వారా ఆరోగ్యం మీద దుష్ప్రభావం పడడమే ఊబకాయం అని ఆయుర్వేదం ఊబకాయాన్ని విశ్లేషించింది.
ఇందుకు కారణాలు… ప్రధానంగా అస్తవ్యస్థ ఆహారపుటలవాట్లు, జీవనశైలి, అలవాట్లే కారణం.

శరీరంలోకి వెళ్లే క్యాలరీలకు తగ్గట్టు శరీరం క్యాలరీలను ఖర్చు చేయకపోవడం మూలంగా అదనంగా మిగిలిపోయిన క్యాలరీలు శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతూ ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.
సాధారణంగా బరువు పెరగడం ప్రపంచ దేశాలన్నిటిలో కనిపిస్తున్న అత్యంత సాధారణమైన ఆరోగ్య సమస్య. మహర్షి చరకుడు రాసిన చరకసంహితంలో ఈ సమస్యకు మేదోరోగం అనే పేరు ఉంది.
తొడలు, ఉదరం, ఛాతీ మొదలైన శరీర ప్రదేశాల్లో అడిపోజ్ కణజాల పరిమాణం పెరిగి, తద్వారా ఆరోగ్యం మీద దుష్ప్రభావం పడడమే ఊబకాయం అని ఆయుర్వేదం ఊబకాయాన్ని విశ్లేషించింది.
ఇందుకు కారణాలు…
ప్రధానంగా అస్తవ్యస్థ ఆహారపుటలవాట్లు, జీవనశైలి, అలవాట్లే కారణం. శరీరంలోకి వెళ్లే క్యాలరీలకు తగ్గట్టు శరీరం క్యాలరీలను ఖర్చు చేయకపోవడం మూలంగా అదనంగా మిగిలిపోయిన క్యాలరీలు శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతూ ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.
వ్యాయామం లోపించడం

వ్యాయామం లోపించడం, పగటివేళ నిద్ర, కఫాన్ని పెంచే పదార్థాలు అధిక కొవ్వులు, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే పదార్థాలు, నూనె, తీపి, ఉప్పు ఎక్కువగా కలిగి ఉండే ఆహారం తీసుకోవడం బరువు పెరగడానికి ప్రధాన కారణాలు.
ఆయుర్వేదం దృష్టిలో…
ఎక్కువ శాతం వ్యాధులకు మూలం ఆహారంలో ఉన్నట్టే, స్థూలకాయానికీ లోపించడం, పగటివేళ నిద్ర, కఫాన్ని పెంచే పదార్థాలు అధిక కొవ్వులు, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే పదార్థాలు, నూనె, తీపి, ఉప్పు ఎక్కువగా కలిగి ఉండే ఆహారం తీసుకోవడం బరువు పెరగడానికి ప్రధాన కారణాలు.
ఆయుర్వేదం దృష్టిలో…
ఎక్కువ శాతం వ్యాధులకు మూలం ఆహారంలో ఉన్నట్టే, స్థూలకాయానికీ మూలం ఆహారంలోనే ఉంది. సరికాని ఆహారం తీసుకోవడం, అస్తవ్యస్థ ఆహారపుటలవాట్లను అనుసరించడం, జీవనశైలి క్రమం తప్పడం మూలంగా జీర్ణాగ్నిలో హెచ్చుతగ్గులు ఏర్పడి ఆమ్లం పెరుగుదలకు దారి తీస్తుంది.
ఈ ఆమ్లం పెరిగితే శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం తగ్గి, కొవ్వు కణజాలం (మేథ ధాతు అగ్ని) అస్థి కణజాలం నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడతాయి. బలహీనంగా ఏర్పడిన కణజాల పొరలు అనవసర మేధ ధాతు (కొవ్వులు)లకు కారణమై కఫ పనితీరును అస్తవ్యస్థం చేస్తాయి. మరో పక్క ఆమం శరీర కణజాల మార్గాలకు అడ్డుపడడంతో వాతంలో కూడా హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.
వాత దోషం కేంద్ర జీర్ణాగ్నిని ప్రేరేపిస్తూ ఆకలిని పెంచుతుంది. ఫలితంగా వ్యక్తి అవసరానికి మించి తినేస్తూ ఉంటాడు. ఇందుకు కారణం. మేధ దవాగ్ని మంధ్య (కొవ్వును శక్తిగా ఖర్చు చేయడంలో బలహీనత) పెరగడంతో అస్తవ్యస్థ మేధ ధాతు తయారవుతుంది. ఇదే ఊబకాయానికి మూల కారణం.
స్థూలకాయం లక్షణాలు…
పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోవడం, నిస్సత్తువ, అధిక స్వేదం ఊబకాయుల్లో కనిపించే ప్రధానమైన లక్షణాలు. ఇవన్నీ ఆరోగ్య పరిస్థితి కుంటుపడింది అని చెప్పడానికి సూచనలు. ఊబకాయుల్లో ఆకలి పెరిగి, దప్పిక, బలహీనత, శక్తి ఖర్చయ్యే వేగం కుంటుపడతాయి.
పొత్తికడుపు దగ్గర, మరీ ముఖ్యంగా స్త్రీ పురుషుల్లో నడుము పైభాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. శరీర కణజాలం సక్రమంగా ఏర్పడకపోవడం మూలంగా వీరిలో నిస్సత్తువ ఆవరించి ఉంటుంది. ఈ లక్షణాలను చికిత్సతో సరిదిద్దకపోతే హైపర్టెన్షన్, కొలెస్ట్రాల్ పెరగడం, హృద్రోగాలు, ఛాతీలో మంట, మూత్రపిండాల సమస్యలు, మధుమేహం, కీళ్ల నొప్పులు, ఆయుష్షు తగ్గడం, వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించడం, మానసిక అయోమయం మొదలైన సమస్యలు తలెత్తుతాయి.
