
సామాన్యుల బ్యాంకు ఖాతాల్లో వందలు, వేలు ఉండటం సహజం. ఎకౌంట్లో ఓ పదివేల రూపాయలు ఉంటే సామాన్యుడికి అది ఎంతో భరోసాగా ఫీలవుతాడు. అలాంటిది ఓ సామాన్య మహిళ ఎకౌంట్లో రూ.10 కోట్లు ఉంటే.. అదికూడా ఆమెకు తెలియకుండా.. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. యూపీకి చెందిన ఒక మహిళ ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేయగా.. స్క్రీన్‌పై కనిపించిన అంకెలు చూసి ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. ఏకంగా రూ. 9,99,49,586 ఆమె అకౌంట్లో జమ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ మైన్‌పురి జిల్లాకు చెందిన ఒక మహిళ… బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగి ఉంది. కొత్త పిన్ జనరేట్ చేయడానికి, బ్యాలెన్స్ ఎంతో చూసుకోవడానికి ఆమె కుమారుడితో కలిసి ఏటీఎంకు వెళ్లింది. అక్కడ స్క్రీన్‌పై పది కోట్ల రూపాయల బ్యాలెన్స్ చూపించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. పక్కా రైతు కుటుంబానికి చెందిన వారు కావడంతో, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాక నేరుగా బ్యాంకుకు పరుగులు తీశారు. ఈ డబ్బు ఎవరిదో తమకు తెలియదని, తమది కాని ఈ డబ్బునుంచి రూపాయి కూడా తమకు అక్కర్లేదని, వెంటనే దీనిని వెనక్కి తీసుకోండి అంటూ ఆ మహిళా తన నిజాయితీని చాటుకుంది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బ్యాంకు అధికారులు స్పందించారు. ఈ క్రమంలో స్పందించి బ్యాంకు మేనేజర్..ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమేనని స్పష్టం చేశారు. సదరు మహిళకు బ్యాంకులో లోన్ అకౌంట్ ఉందని, సాఫ్ట్వేర్ సమస్య వల్ల అలా భారీ మొత్తం చూపిస్తోందని వెల్లడించారు. ఏది ఏమైనా, కోట్లు ఖాతాలో పడితే ఎవరైనా ఆశపడతారు..వెంటనే డ్రాచేసి వాడుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ ఆ మహిళ తన ఎకౌంట్లో పడిన డబ్బుపై ఆశపడలేదని, ఆమె నిజాయితీని నెటిజన్లు అభినందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన ‘నానో బనానా’
కొంప ముంచిన గ్యాస్ బుకింగ్.. భార్యను చంపిన భర్త అరెస్ట్
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
