తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వారమంతా చాలావరకు ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఆదాయ ప్రయత్నాలు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడ తారు. జీవిత భాగస్వామికి ఊహించని అదృష్టం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు ప్రవేశపెడతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
