సామాన్యులకు గుడ్ న్యూస్. టమాటా, వంకాయ ధరలు పడిపోగా.. బీరకాయ, పచ్చిమిర్చి ధరలు పెరిగాయి. టమాటా, వంకాయ ధరలు గత కొద్ది నెలలుగా భారీగా తగ్గుతున్నాయి. అదే బాటలో ఇప్పుడు మరింతగా తగ్గుముఖం పట్టాయి. అటు గత కొద్దిరోజులుగా పచ్చిమిర్చి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కిలో టమాటా రూ.10కే లభిస్తుండగా.. వంకాయ రూ.15కి రైతు మార్కెట్లలో విక్రయిస్తున్నారు
ఇక బెండకాయ రూ.28కి అమ్ముడవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ధరలు ఇలాగే ఉన్నాయి. కూరగాయల ధరలు తగ్గడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. కూకట్ పల్లి రైతు బజార్, విజయవాడ, గుంటూరు నగరాల్లోని రైతు బజార్లలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయనేది ఇందులో చూద్దాం.
కూకట్ పల్లి రైతు బజార్లో కేజీ టమాటా రూ.10, వంకాయ రూ.15, బెండకాయ రూ.28, పచ్చిమిర్చి రూ.40, బజ్జి మిర్చి రూ.20, కాకరకాయ రూ.23, బీరకాయ రూ.35, క్యాబేజీ రూ.12, బీన్స్ రూ.40, క్యారెట్ రూ.18, గోబి పువ్వు రూ.25, దొండకాయ రూ.35, చిక్కుడుకాయ రూ.40, గోరు చిక్కుడు రూ.25, బీట్ రూట్ రూ.18, క్యాప్చికం రూ.35, ఆలుగడ్డ రూ.18కి దొరుకుతున్నాయి.
కిలో కీర రూ.14, దోసకాయ రూ.13, సొరకాయ రూ.15, పొట్లకాయ రూ.20, కంద రూ.35, ఉల్లపొరక రూ.25, ఉల్లిగడ్డ రూ.18, చామగడ్డ రూ.30, చిలకడదుంప రూ.25, ఎండుమిర్చి రూ.240, పుట్టగొడుగులు రూ.45, పండుమిర్చి రూ.80, పల్లికాయ రూ.50 వద్ద ఉంది.
ఇక విజయవాడ, గుంటూరులో టమాటా రూ.14, వంగ రూ.20, బెండ రూ.19, పచ్చిమిర్చి రూ.24, కాకర రూ.22, క్యాబేజీ రూ.14, క్యారెట్ రూ.28, దొండకాయ రూ.26, బంగాళదుంప రూ.22, ఉల్లిపాయలు రూ.21, గోరుచిక్కుడు రూ.22, దోసకాయ రూ.18, సొర రూ.11, చామదుంప రూ.24, అససందలు రూ.30, చిలకడదుంప రూ.24 పలుకుతున్నాయి.





