తాజావార్తలు

TTD Dollars: ఇకపై తిరుమల శ్రీవారి డాలర్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి..!

TTD Dollars: ఇకపై తిరుమల శ్రీవారి డాలర్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి..!


TTD Dollars: ఇకపై తిరుమల శ్రీవారి డాలర్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి..!

తిరుపతి, మార్చి 13: తిరుమల శ్రీవారి బంగారు వెండి డాలర్లను ఇకపై భక్తులు ఈజీ గానే పొందవచ్చు. శ్రీవారి డాలర్లను కొనేందుకు తిరుమల వెళ్లకుండానే కొనుగోలు చేయవచ్చు. ఇందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా భక్తులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. శ్రీవారి గోల్డ్, సిల్వర్, బ్రాస్ డాలర్ల ను విక్రయిస్తున్న టీటీడీ డాలర్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు పరిశీలన చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే టీటీడీ ట్రెజరీ, జూవెలరీ వింగ్, బ్యాంక్ సిబ్బందితో సమావేశాలు కూడా జరిపింది. దేశవ్యాప్తంగా భక్తులకు పోస్టల్ ద్వారా డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆదాయం పెంపు పై ఫైనాన్స్ కమిటీ చేసిన సిఫార్సులకు పాలకమండలి ఆమోదం కూడా తెలిపింది. దీంతో స్వామివారి దర్శనానంతరం భక్తులు ఎంతో పవిత్రంగా భావించి కొనుగోలు చేసే బంగారు, వెండి డాలర్లను ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలన్న నిర్ణయం అమలు లోకి రానుంది.

తక్కువ ధరలో బంగారం పూత పూసిన వెండి డాలర్ల విక్రయానికి ప్రతిపాదన పరిశీలనలో వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పనుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన భక్తులకు పోస్టల్ సర్వీస్ ను వినియోగించుకోబోతుంది. ప్రస్తుతం తిరుమలలోని కౌంటర్ లో 2, 5, 10 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్లు, 5, 10, 50 గ్రాముల వెండి డాలర్లను టీటీడీ విక్రయిస్తోంది.
వారానికో రోజు ధర నిర్ణయించి శ్రీవారి బంగారు వెండి డాలర్ల విక్రయాలను సాగిస్తోంది. శ్రీవారి డాలర్లనలను GST తో కలిపి ధర నిర్ధారించి విక్రయాలు సాగిస్తున్న టీటీడీ సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేలా డాలర్లను తయారు చేసి విక్రయించే ఆలోచనలో ఉంది. ఒక గ్రాము నుంచి 10 గ్రాముల వరకు 10 రకాల శ్రీవారి డాలర్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆన్ లైన్ లో విక్రయించాలన్న చర్యలకు శ్రీకారం చుట్టబోతోంది.

 

మరోవైపు బులియన్ మార్కెట్ లో బంగారం ధర పరుగులు పెడుతుండగా ఇప్పటికీ ప్రతి బుధవారం డాలర్ ధరలను నిర్ధారించి విక్రయిస్తున్న టీటీడీ వారం మొత్తం అదే ధరలకు విక్రయిస్తోంది. దీంతో శ్రీవారి డాలర్ల కొనుగోలుకు భక్తుల నుంచి డిమాండ్ కూడా పెరుగుతుండడంతో విక్రయాలను ఎలా కొనసాగించబోతోందన్న దానిపై స్పష్టత లేకపోతోంది. ధరల తేడాతో డాలర్ల కొనుగోలుకు డిమాండ్ పెరిగితే విక్రయాల్లో ఎలాంటి షరతులు విధించబోతుందన్న విషయంపై టీటీడీ వర్గాల నుంచి క్లారిటీ లేకపోతోంది. తిరుమలలో వారానికో రోజు బంగారం ధర ఫిక్స్ చేసి శ్రీవారి బంగారు వెండి డాలర్లు అమ్ముతున్న టీటీడీ బయట మార్కెట్ కంటే తక్కువ ధరకే శ్రీవారి డాలర్లు అమ్మితే పెరిగిన గిరాకీకి తగ్గట్టుగా డాలర్లను ఎలా సమకూర్చుతుందో వేచి చూడాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో బంగారం ధర విపరీతంగా పెరిగడంతో ఏ రోజు ధర ఆ రోజు నిర్ణయించి శ్రీవారి డాలర్లను విక్రయించాలని భావించిన టీటీడీ దర్శనం టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే శ్రీవారి డాలర్లను విక్రయించాలన్న ఆలోచన కూడా చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *