తాజావార్తలు

Triptii Dimri Skincare Secrets: వంటింటి చిట్కాలే ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి సౌందర్య రహస్యం

Triptii Dimri Skincare Secrets: వంటింటి చిట్కాలే ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి సౌందర్య రహస్యం


తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సౌందర్య రహస్యాలను, జీవనశైలిని పంచుకున్న విశేషాలేంటో తెలుసుకుందాం. ఆమె ఒకప్పుడు కేవలం మోడల్, కానీ ‘యానిమల్’ సినిమా తర్వాత ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చూసి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇంత అందంగా ఉండటానికి ఆమె వేల రూపాయల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఆమె మాత్రం “అందం అంటే ఖరీదైన వస్తువుల్లో లేదు, మనం తీసుకునే జాగ్రత్తల్లో ఉంది” అని చెబుతోంది. తన చర్మ సౌందర్యం కోసం అనాదిగా వస్తున్న మన భారతీయ పద్ధతులనే నమ్ముతున్న ఆ సెన్సేషనల్ బ్యూటీ మరెవరో కాదు.. త్రిప్తి దిమ్రి.

చాలా మంది హీరోయిన్లు గంటల తరబడి స్కిన్ కేర్ కోసం సమయం కేటాయిస్తుంటే, త్రిప్తి మాత్రం చాలా సింపుల్ పద్ధతులను పాటిస్తుంది. ఆమె ఉదయం నిద్రలేవగానే ముఖాన్ని శుభ్రం చేసుకుని, అప్పుడప్పుడు విటమిన్-సి సీరమ్ వాడుతుంది. ఆ తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసుకోవడం ఆమెకు అలవాటు. ముఖ్యంగా తన టీ-జోన్ (నుదురు, ముక్కు భాగం) జిడ్డుగా మారకుండా ఉండేందుకు తక్కువ ఆయిలీగా ఉండే ప్రొడక్ట్స్ ఎంచుకుంటుంది.

బామ్మ కాలం నాటి చిట్కాలు..

ఆధునిక సౌందర్య సాధనాల కంటే త్రిప్తికి వంటింటి చిట్కాలంటేనే ఎక్కువ మక్కువ. జుట్టు సంరక్షణ కోసం ఆమె ఆమ్లా (ఉసిరి), రీటా, షికాకాయ్ వంటి సహజ సిద్ధమైన వస్తువులనే వాడుతుంది. అలాగే చర్మం మెరిసిపోవడానికి శనగపిండి, పెరుగు, పసుపు కలిపిన మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌గా ఉపయోగిస్తుంది. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు చర్మం పొడిబారకుండా ఉండటానికి ఈ సహజ పద్ధతులే తనకు ఎంతో సహాయపడతాయని ఆమె వెల్లడించింది.

అందం కేవలం బయట కనిపించే అలంకరణలోనే కాదు, మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామంపై కూడా ఆధారపడి ఉంటుందని త్రిప్తి నమ్ముతుంది. ఆమె క్రమం తప్పకుండా పైలేట్స్ వ్యాయామాలు చేస్తుంది. ఆహారం విషయంలో ఆమె మరీ కఠినంగా ఉండదు. తనకు నచ్చిన పదార్థాలను తింటూనే, పోషక విలువలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. శరీరంలో తేమ తగ్గకుండా ఉండేందుకు నీళ్లు ఎక్కువగా తాగుతుంది.

నిజమైన అందం అంటే..

త్రిప్తి దిమ్రి దృష్టిలో నిజమైన అందం అంటే తనను తాను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడమే. “ఆత్మవిశ్వాసం, నిజాయితీ అనేవి మనిషికి అసలైన అందాన్ని ఇస్తాయి. బయట కనిపించే రూపం కంటే మన అంతర్గత ప్రశాంతతే ముఖ్యం” అని ఆమె ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. రాత్రి పడుకునే ముందు మేకప్ మొత్తం తీసేసి, ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజర్ రాసుకోవడం తన దినచర్యలో ముఖ్య భాగమని ఆమె వివరించింది. స్టార్ హీరోయిన్​గా ఎదిగినా, త్రిప్తి దిమ్రి తన మూలాలను మర్చిపోకుండా సంప్రదాయ పద్ధతులను పాటించడం నిజంగా అభినందనీయం. ఆమె చెప్పిన ఈ సింపుల్ చిట్కాలు నేటి తరం యువతకు ఎంతో ఉపయోగపడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *