Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. రోజురోజుకు భారీ స్థాయిలో దిగి వస్తుండటంతో మహిళలు ఆనందంతో గంతులేస్తున్నారు. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారం కొనేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతారు.
తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 980 రూపాయలు తగ్గుముఖం పట్టగా, 22 క్యారెట్ల 10 గ్రాములపై 900 రూపాయల వరకు దిగి వచ్చింది.
ఇక ధరలు తగ్గిన తర్వాత హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,240 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,47,800 వద్ద ట్రేడవుతోంది. వెండి స్వల్పంగా అంటే వంద రూపాయలు మాత్రమే తగ్గింది. తగ్గిన తర్వాత కిలో వెండి ధర రూ.2,79,900 వద్ద ట్రేడవుతోంది.
బంగారాన్ని ప్రభావితం చేసే అంశాలు: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ కమోడిటీ మార్కెట్లను ప్రభావితం చేస్తూనే ఉంది.బంగారం ధరలను ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, అమెరికా డాలర్ విలువ (రూపాయి బలహీనపడితే ధర పెరుగుతుంది), ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (యుద్ధాలు) ప్రభావితం చేస్తాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో పెరిగే డిమాండ్ కూడా స్థానిక ధరలపై ప్రభావం చూపుతుంది
శుక్రవారం ప్రపంచ మార్కెట్లో, US డాలర్ స్వల్పంగా తగ్గడం, US ట్రెజరీ దిగుబడి తగ్గడంతో బంగారం ధరలు పెరిగాయి. ప్రారంభ ట్రేడింగ్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు $5,118.75 వద్ద ట్రేడవుతుండగా, ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన US గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు $5,123 దగ్గర ఉన్నాయి.





