
తెలంగాణ ప్రజలకు భారీ గుడ్న్యూస్. రాష్ట్రంలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లు రానున్నాయి. వీటి నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. త్వరలో నిర్మాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. తాజాగా వీటికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ రెండు ఎయిర్పోర్టులకు శంకుస్థాపన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. జూన్లో శంకుస్థాపన ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తవ్వగా.. నిర్మాణం త్వరలో ప్రారంభించనున్నారు.
వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్
వరంగల్ సమీపంలోని మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జూన్లో శంకుస్ధాపన కార్యక్రమం నిర్వహించానే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉంది. ఇప్పటికే ఈ రెండు ఎయిపోర్టుల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీతో శంకుస్థాపన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మామునూరు ఎయిర్పోర్ట్ కోసం రూ.850 కోట్లు అవసరమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. వరంగల్ జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణం చేపట్టనున్నారు. అటు వెయ్యి ఎకరాల్లో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే దీని నిర్మాణం కోసం 415 ఎకరాలు సేకరించగా.. మరో 700 ఎకరాల భూసేకరణ చేపట్టనున్నారు. ఈ ఎయిర్పోర్ట్కు భూసేకరణ చేపట్టేందుకు 2025 నవంబర్ 3న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2.9 కిలోమీటర్ల రవ్ వే
ఇక ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో రన్ వే 2.9 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం రూ.400 కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. ఇక ప్రత్యేకంగా డిఫెన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక్క పార్క్ చేసుకునే విమానాలకు 15 శాతమే అద్దె వసూలు చేయనున్నారు. ఇక పౌర, మిలిటరీ విమానాలు దిగేలా రన్ వే నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాత్రమే ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంది. మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులు అందుబాటులోకి వస్తే తెలంగాణలోని అన్ని జిల్లాలకు ప్లైట్ కనెక్టివిటీ పెరుగనుంది. దీని వల్ల శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకోవాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్పై కూడా ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త ఎయిర్పోర్టుల రాకతో వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలు మరింత అభిృద్ది పథకంలో దూసుకెళ్లనున్నాయి. కొత్త కంపెనీలు రావడం, టూరిజం అభివృద్ది చెందటం లాంటివి జరగనున్నాయి. దీని వల్ల స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సరుకు రావాణా పెరగడం వల్ల లాజిస్ట్రిక్స్ రంగం ఊపందుకోనుంది.
