
ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో చదువుకునే విద్యార్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు పోషకమైన ఆహారం అందించే లక్ష్యంతో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ స్కూల్‌లు, కాలేజీలలో విద్యార్థుకు అల్పాహారం అందించాలని నిర్ణయింది. వారంలో మూడు రోజుల పాటు రాగి జావ, మరో మూడు రోజులు పాలు అందించాలని విద్యాశాఖ డిసైడ్ అయింది. ప్రభుత్వ తాజా నిర్ణయం అమల్లోకి వస్తే సుమారు 19 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది..
అయితే ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ స్కూల్‌లు, కాలేజీలలో ఉదయం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద వారంలో మూడు రోజుల పాటు రాగి జావను అందిస్తున్నారు. అయితే తాజాగా ఫిబ్రవరి 26న విద్యాశాఖపై అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి స్కూల్ విద్యార్థులకు రాగిజావతో పాటు పాలు కూడా అందించాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాలతో అటు విద్యాశాఖ సైతం ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రయత్నాలు మొదటు పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది విద్యార్థులు ఉన్నారనేది అంచనా వేసింది. ప్రభుత్వ కాలేజీలు, స్కూల్‌లో సుమారు 19 లక్షల మంది విద్యార్థులున్నట్లు గుర్తించింది. వారందరికి రాగిజావతో పాటు పాలు అందించాలని కసరత్తు చేస్తోంది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 430 కాలేజీలు ఉండగా వాటిలో దాదాపు 1.80లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి కూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అందించాలని ప్రభుత్వం నిర్ణయింది. అయితే వీరికి కేవలం రాగి జావ మాత్రమే అందిస్తారా? లేదా పాలు కూడా అందిస్తారా? అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
