మార్చి నెలలోనే ఎండలు భగభగలాడుతున్నాయి. దాదాపు వేసవి మొదలైనట్లే. వేడి తీవ్రత కూడా నానాటికీ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేసవిలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు చేసే ఏ ఒక్క పొరపాటు కూడా మిమ్మల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంది.
ముఖ్యంగా నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. నీళ్లు తాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలి.
జీర్ణక్రియను మెరుగుపరచడానికి, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి, శరీరంలోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు బయటకు పంపడానికి తగినంత నీళ్లు తాగడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ నీళ్లు తాగడం చాలా అవసరం.
శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి కూడా నీళ్లు సహాయపడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 2 నుంచి 3 లీటర్ల నీళ్లు ప్రతి రోజూ శరీరంలోకి వెళ్లాలి.
అయితే వేసవిలో కూడా చాలా మంది టీ, కాఫీ, జ్యూస్లు తాగడం వల్ల శరీరంకి అధిక నీళ్లు అందుతాయని అనుకుంటారు. అయితే ఇది అస్సలు నిజం కాదు. టీ, కాఫీలో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది. ఇది నిర్జలీకరణాన్ని పెంచుతుంది. టీ లేదా కాఫీని మితంగా తీసుకోవాలి. బదులుగా పుష్కలంగా నీళ్లు తాగడంపై దృష్టి పెట్టాలి. ఇది మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.





