తాజావార్తలు

SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తొలి మ్యాచ్‌కు ముందే జట్టులో చేరనున్న ఇద్దరు స్టార్ ప్లేయర్స్

SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తొలి మ్యాచ్‌కు ముందే జట్టులో చేరనున్న ఇద్దరు స్టార్ ప్లేయర్స్


SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తొలి మ్యాచ్‌కు ముందే జట్టులో చేరనున్న ఇద్దరు స్టార్ ప్లేయర్స్

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం పాట్ కమిన్స్ రాకపై స్పష్టతనిచ్చింది. గత కొంతకాలంగా వెన్ను గాయంతో బాధపడుతున్న కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఎన్‌ఓసీ (NOC) మంజూరు చేయడంలో జాప్యం జరిగినప్పటికీ, ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ లభించింది. మార్చి 24న ఆయన నేరుగా బెంగళూరుకు చేరుకుంటాడు. అయితే, కమిన్స్ జట్టుతో చేరినప్పటికీ తొలి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం కష్టమేనని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించే వరకు ఆయన కేవలం తేలికపాటి శిక్షణకే పరిమితం కానున్నాడు.

సారథిగా ఇషాన్ కిషన్.. వైస్ కెప్టెన్‌గా అభిషేక్ శర్మ..

కమిన్స్ గైర్హాజరీలో జట్టు పగ్గాలను టీమ్ ఇండియా డాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్‌కు అప్పగిస్తూ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. కిషన్ ఇటీవల దేశీవాళీ క్రికెట్‌లో జార్ఖండ్ జట్టును విజేతగా నిలిపి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. మార్చి 25న ముంబైలో జరగనున్న కెప్టెన్ల సమావేశానికి కూడా ఇషాన్ కిషన్ హాజరుకానున్నాడు. యువ ఆటగాడు అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. కమిన్స్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి మైదానంలోకి దిగే వరకు ఈ జోడీయే జట్టును నడిపించనుంది.

ఇది కూడా చదవండి: Team India: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. ఓపెనర్‌గా సూర్యవంశీ.. ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు ఇదే..?

మలింగ రాకతో పెరిగిన బౌలింగ్ బలం..

సన్‌రైజర్స్‌కు మరో శుభవార్త ఏమిటంటే, శ్రీలంక బౌలర్ ఇషాన్ మలింగకు అక్కడి బోర్డు నుంచి అనుమతి లభించింది. ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణుడైన మలింగ, తొలి మ్యాచ్ నుంచే జట్టుకు అందుబాటులో ఉంటాడు. గతేడాది 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి అదరగొట్టిన మలింగ, ఈసారి కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. జాక్ ఎడ్వర్డ్స్ గాయంతో దూరం కావడంతో మలింగ రాక ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగానికి ఊపిరి పోసింది.

ఇది కూడా చదవండి: PSLను ఛీకొట్టాడు.. కట్‌చేస్తే.. రూ. 2 కోట్లతో హారతి పట్టేసిన ఐపీఎల్.. అసలెవరీ ఆల్ రౌండర్..!

మార్చి 28న ఆర్‌సీబీతో తొలి పోరు..

మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. 2016 ఫైనల్ ప్రత్యర్థుల మధ్య జరగనున్న ఈ పోరుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవైపు కమిన్స్ రాక, మరోవైపు మలింగ ఎంట్రీతో హైదరాబాద్ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *