తాజావార్తలు

School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు వరుస సెలవులు!

School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు వరుస సెలవులు!


School Holidays: పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరిగంతులేస్తారు. అలాంటిది ఫిబ్రవరి నెల ముగియనుంది. మార్చి నెల రాబోతోంది. మార్చిలో విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి. అందులో పండగల, ఆదివారాలు, రెండో శనివారాలు ఇలా ఇతర కార్యక్రమాల నేపథ్యంలో వరుస సెలవులు రానున్నాయి. అవేంటో చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు మార్చి నెలలో వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు సెలవులు వస్తున్నాయి.

ఈ 11 రోజుల సెలవుల్లో అటు పండుగలు, ఇటు వారాంతపు సెలవులు కలిసి చాలా ఉన్నాయి. మార్చి 3వ తేదీన హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తుంటాయి ప్రభుత్వాలు. అలాగే మార్చి 19న తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ. దీంతో పాఠశాలలకు సెలవు ఉంటుంది. అలాగే మరుసటి రోజు మార్చి 20వ తేదీన రంజాన్ పండగా, అలాగే మార్చి 21న శనివారం వస్తుంది. ఈ ఒక్క రోజు కొన్ని పాఠశాలలు కొనసాగుతాయి. మరి కొన్ని పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇక మార్చి 27న శ్రీరామ నవమి, మార్చి 31న మహావీర్ జయంతి (ఆప్షన్ హాలీడే) వంటి పండుగల్లో పాఠశాలలకు సెలవులు ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 22వ విడత వచ్చేది అప్పుడేనా..?

14న రెండో శనివారం:

ఇక మార్చి 14న రెండో శనివారం కారణంగా పాఠశాలలకు సెలవు ఉండనుంది. వీటితో పాటు మార్చి నెలలో 5 ఆదివారాలు ఉన్నాయి. ఇవి కూడా సెలవు దినాలుగా పరిగణించినా.. మార్చి నెలలో మొత్తంగా 11 రోజుల పాటు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులకు పండగే.. పండగ.

ఇదిలా ఉండగా, ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణలో మార్చి 10 -25 తేదీల మధ్య పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటి పూట బడులు కూడా మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏదీ ఏమైనా ఫిబ్రవరి నెల కంటే మార్చి నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి.

ఇది కూడా చదవండి: Bank New Service: ఇక కేవలం 15 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం.. ఈ బ్యాంకు కొత్త పోర్టల్‌!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *