తాజావార్తలు

Rythu Bharosa: మీకు రైతు భరోసా డబ్బులు అందలేదా..? ఈ పని చేస్తే పొందే అవకాశం.. ఏం చేయాలంటే..?

Rythu Bharosa: మీకు రైతు భరోసా డబ్బులు అందలేదా..? ఈ పని చేస్తే పొందే అవకాశం.. ఏం చేయాలంటే..?


Rythu Bharosa: మీకు రైతు భరోసా డబ్బులు అందలేదా..? ఈ పని చేస్తే పొందే అవకాశం.. ఏం చేయాలంటే..?

తెలంగాణ ప్రభుత్వం ఆదివారం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా నిధులను జమ చేశారు. ఇవాళ లబ్దిదారులందరికీ తొలి ఎకరానికి రూ.6 వేలు జమ చేయగా.. రెండు, మూడు విడతల్లో అన్ని ఎకరాలకు అందించనున్నారు. నేడు తొలి ఎకరానికి మాత్రమే డబ్బులు పడగా.. ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు కావడంతో సోమవారం లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే మీ అకౌంట్లో డబ్బలు పడకపోతే ఏం చేయాలి..? ఎవరిని సంప్రదించాలి? అనే విషయాలు చూద్దాం.

డబ్బులు రాకపోతే..

రైతు భరోసా సొమ్ము మీకు అందకపోతే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించండి. ఇక మండల వ్యవసాయ అధికారిని కలిసి ఫిర్యాదు చేయవచ్చు. వీరిని కలిసి మీకు ఎందుకు పడలేదు..? సమస్య ఏంటి? అనే వివరాలను తెలుసుకోండి. అర్హల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయిందా..? లేదా..? బ్యాంక్ కేవైసీ యాక్టివ్‌లో ఉందా..? లేదా? అనే వివరాలు చూసుకోండి. ఇక మీ పాస్ బుక్ వివరాలు ధరణి పోర్టల్‌లో చెక్ చేసుకుని రిజిస్టర్ అయ్యాయా..? లేదా? అనే డీటైల్స్ తనిఖీ చేయండి. ఇక కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన సమయంలో సకాలంలో రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. గడువులోగా చేసుకోకపోతే డబ్బులు పడవు.

మళ్లీ ఎప్పుడు జమ చేస్తారు..?

అధికారులను అడిగి సమస్యను పరిష్కరించుకుంటే తర్వాతి విడతలో మీకు డబ్బులు జమ అవుతాయి. అందుకే సాంకేతిక సమస్యలను పరిష్కరించుకోండి. ఇక ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్ట్రర్ అయి ఉండాలి. లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోవచ్చు. దీంతో ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోండి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులు, రాయితీలు వేగవంతంగా, సులభంగా పొందటంలో ఫార్మర్ రిజిస్ట్రీ సహాయడపతుంది. కాగా ప్రస్తుతం తొలి ఎకరానికి ప్రభుత్వం రైతు భరోసా అందిస్తోంది. ఎన్ని ఎకరాలు ఉన్నవారికైనా సరే తొలి ఎకరానికి రూ.6 వేలు తొలి విడతలో పొందనున్నారు. లబ్దిదారులందరీ అకౌంట్లలో రూ.6 వేల జమ కానున్నాయి.  రైతు భరోసా అందనివారు అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచిస్తోంది. అర్హులైన ప్రతీఒక్కరికీ అబ్ది అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పడనివారు వెంటనే అధికారులను సంప్రదించడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *