
శీతాకాలంలో చలిగాలుల వల్ల కళ్లలో దురద, మంటతోపాటు కళ్లు ఎరుపెక్కడం, చూపు మసకబారడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి.
ఈ సమస్యలను నివారించే చిట్కాలు ఇవే…
ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఫ్రీ రాడికల్స్ వచ్చే కంటి శుక్లాల సమస్య తగ్గుతుంది. దీనిలోని సి విటమిన్.. చూపు మసకబారడాన్ని ఆపుతుంది.https://studio.youtube.com/video/MSOQ6UQbhgw/edit
తరచూ కేరట్ తినడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దీనిలోని ఎ విటమిన్ రేచీకటిని అరికడుతుంది.
పాలకూర, తోటకూర, పొన్నగంటి కూరలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల పెద్దవారిలో ఎదురయ్యే కంటి సమస్యలు తగ్గుతాయి. కళ్ల నుంచి అకారణంగా నీళ్లు కారడం, కళ్లు పొడిబారడం నుంచి ఉపశమనం https://studio.youtube.com/video/pMAcF2iWlMU/editకలుగుతుంది.
బాదం పప్పుతోపాటు సాల్మన్, మాకెరెలా, ట్యూనా లాంటి చేపలను ఆహారంగా తీసుకుంటే వాటిలోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ప్రభావవంతంగా పనిచేసి కంటి చూపును మెరుగుపరుస్తాయి.https://studio.youtube.com/video/BeZlXt88L7o/edit
చలికాలంలో ఎక్కువగా లభించే నరింజ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, అనాస పండ్లను తినడం వల్ల కళ్లకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
కళ్లు కాంతివంతంగా మారతాయి. కోడిగుడ్లు, టమాటాలను తీసుకోవడం వల్ల వయసు పెరగడం వల్ల మందగించే కంటి చూపు మెరుగుపడుతుంది.https://studio.youtube.com/video/4mxYw6Oog9g/edit
