తాజావార్తలు

OTT Movie: సర్‌ప్రైజ్.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా.. ఇంటిల్లిపాది నవ్వుకోండిక

OTT Movie: సర్‌ప్రైజ్.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా.. ఇంటిల్లిపాది నవ్వుకోండిక


OTT Movie: సర్‌ప్రైజ్.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా.. ఇంటిల్లిపాది నవ్వుకోండిక

జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు హీరో శ్రీ విష్ణు. ఓ వైపు డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూనే మరో వైపు ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. అలా గత నెలలో ఏకంగా రెండు సినిమాలతో మన ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. అది కూడా ఒక వారం గ్యాప్ లో. అందులో విష్ణు విన్యాసం ఒకటి. ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాగానే ఆడింది. ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందించింది. ఇందులో శ్రీవిష్ణుకు జోడిగా నయన్ సారిక నటించింది. అలాగే సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్‌, సత్యం రాజేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శ్రీనివాస్‌ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు ప్రధాన పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. అది కూడా రిలీజైన మూడు వారాల్లో ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా.

విష్ణు విన్యాసం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (మార్చి20) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి ఇతర పాన్ ఇండియా భాషల్లోనూ విష్ణు విన్యాసం సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. సుమంత్ నాయుడు నిర్మించిన ఈ సినిమాకు రధన్ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ కామెడీ ఎంటర్ టైనర్ ను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసేయండి.. కడుపుబ్బా నవ్వుకోండి.

కథేంటంటే..
ఇందులో హీరో విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్‌ లెక్చరర్‌. జాతకాలు, మూడనమ్మకాలటే అతనికి పిచ్చి.  అందుకే 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోడు. అతన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది లెక్చరర్‌ మనీషా(నయనసారిక). ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటాయి. మొదట పట్టించుకోకపోయినా విష్ణు కూడా ఆమెను ఇష్టపడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు. ఇంతలో మనీషా ఓ నిజం చెబుతుంది. దీంతో వీరిద్దరి జీవితాలు మలుపు తిరుగుతాయి. మరి ఆ నిజమేంటి?  చివరికి విష్ణు, మనీషాలు పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by VEER_MOVIE UPDATES 🎬 (@veer_movieupdates_)

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *