అద్భుతమైన శిల్పకళ (Architectural Splendor): ఖజురహో ఆలయాలు వాటి నాగరా శైలి నిర్మాణానికి ప్రసిద్ధి. ఇక్కడి ప్రతి ఇటుక, ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. దేవతలు, సంగీతకారులు, నృత్యకారులు, నాటి సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే వేలాది శిల్పాలు అత్యంత సూక్ష్మంగా చెక్కబడ్డాయి.
కామసూత్ర శిల్పాలు (Erotic Sculptures): చాలామంది ఖజురహో అంటే కేవలం శృంగార శిల్పాలే (Erotic Art) అనుకుంటారు. కానీ, వాస్తవానికి ఇక్కడి శిల్పాలలో కేవలం 10శాతం మాత్రమే అలా ఉంటాయి. ఇవి మానవ జీవితంలోని కామ అనే కోణాన్ని, సంతానోత్పత్తిని, ఆధ్యాత్మికతతో ముడిపడిన ప్రాపంచిక సుఖాలను గౌరవప్రదంగా వర్ణిస్తాయి. చందేల రాజులు మన శరీరక సుఖాలు కూడా ఆధ్యాత్మిక మార్గంలో భాగమేనని, సంపూర్ణ మానవుడిగా ఎదగాలంటే వీటన్నిటిపై అవగాహన ఉండాలని ఈ శిల్పాల ద్వారా తెలియజేశారు.
దాంపత్యానికి అద్దంపట్టే శిల్పాలు (Erotic Sculptures): చాలామంది ఖజురహో అంటే కేవలం శృంగార శిల్పాలే (Erotic Art) అనుకుంటారు. కానీ, వాస్తవానికి ఇక్కడి శిల్పాలలో కేవలం 10శాతం మాత్రమే అలా ఉంటాయి. ఇవి మానవ జీవితంలోని కామ అనే కోణాన్ని, సంతానోత్పత్తిని, ఆధ్యాత్మికతతో ముడిపడిన ప్రాపంచిక సుఖాలను గౌరవప్రదంగా వర్ణిస్తాయి. చందేల రాజులు మన శరీరక సుఖాలు కూడా ఆధ్యాత్మిక మార్గంలో భాగమేనని, సంపూర్ణ మానవుడిగా ఎదగాలంటే వీటన్నిటిపై అవగాహన ఉండాలని ఈ శిల్పాల ద్వారా తెలియజేశారు.
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద: వీటి విశిష్టతను గుర్తించి, 1986లో యునెస్కో (UNESCO) ఖజురహోను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. మధ్యయుగపు భారతదేశపు కళా వైభవానికి ఇవి సజీవ సాక్ష్యాలుగా గుర్తింపునిచ్చింది. ఆ కాలపు యుద్ధ వీరులు, వేటగాళ్లు, సంగీతకారులు, మేకప్ చేసుకుంటున్న మహిళలు, దైనందిన పనులు చేస్తున్న సామాన్యుల శిల్పాలు కూడా ఉన్నాయి. అంటే, మానవ జీవితంలోని అన్ని దశలను ఇక్కడి రాళ్లపై చూడవచ్చు.
చందేల వంశీయుల కళా పిపాస: ఈ ఆలయాలను క్రీ.శ. 950 నుండి 1050 మధ్య కాలంలో చందేల రాజవంశీయులు నిర్మించారు. మొదట ఇక్కడ 85 ఆలయాలు ఉండగా, ప్రస్తుతం కేవలం 25 మాత్రమే చెక్కుచెదరకుండా ఉన్నాయి. వీటిలో కందరీయ మహాదేవ ఆలయం అత్యంత పెద్దది. ప్రసిద్ధమైనది. ఇది ఖజురహోలోనే అతిపెద్ద, అత్యంత శిల్పకళా శోభితమైన ఆలయం. శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయ గోపురం కైలాస పర్వతాన్ని పోలి ఉంటుంది. దీనిపై సుమారు 800 పైగా అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి.
మత సామరస్యం: ఖజురహోలో కేవలం హిందూ దేవాలయాలే కాకుండా, జైన దేవాలయాలు కూడా పక్కపక్కనే ఉన్నాయి. ఇది నాటి కాలంలో ఉన్న మత సామరస్యానికి, పరమత సహనానికి నిదర్శనం.
ఇకపోతే, ప్రతిరోజూ సాయంత్రం ఆలయ చరిత్రను వివరిస్తూ జరిగే లైట్ అండ్ సౌండ్ షో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఏటా ఫిబ్రవరిలో జరిగే ఖజురహో నృత్యోత్సవం అంతర్జాతీయ నృత్య వేడుకలో ప్రపంచ స్థాయి కళాకారులు పాల్గొంటారు.






