తాజావార్తలు

Hyderabad: తెలంగాణకు కేంద్రం శుభవార్త.. రీజినల్ రింగ్ రోడ్డుపై బిగ్ అప్డేట్..

Hyderabad: తెలంగాణకు కేంద్రం శుభవార్త..  రీజినల్ రింగ్ రోడ్డుపై బిగ్ అప్డేట్..


Hyderabad: తెలంగాణకు కేంద్రం శుభవార్త..  రీజినల్ రింగ్ రోడ్డుపై బిగ్ అప్డేట్..

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న రీజినల్ రిగ్ రోడ్డు దక్షిణ భాగం ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక లేఖ రాశారు. డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీని నియమించినట్లు తన లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై కేంద్రం ముందడుగు వేసినట్లు అయింది. హైదరాబాద్ అభివృద్దిలో ఇది కీలక పరిణామంగా మారనుంది. రీజినల్ రింగ్ రోడ్డు కోసం తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచి ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతోంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి స్పందన రావడంతో ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

గత ఏడాది ఆగస్టులో లేఖ

ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగానికి అనుమతులు మంజూరు చేయాల్సింగా గత ఏడాది ఆగస్టులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఈ క్రమంలో తాజాగా ఆ లేఖపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. డీపీఆర్‌ తయారీ పనులు జరుగుతున్నాయని, ఈ మేరకు డీపీఆర్ సిద్దం చేసేందుకు ఓ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. డీపీఆర్ సిద్దం అయ్యాక తదుపరి చర్యలు తీసుకుంటామాని స్పష్టం చేశారు. ఇక ఈ లేఖపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. సమాధానం ఇచ్చినందుకు గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర భాగం ఇప్పటికే టెండరల్ దశలో ఉందని, దక్షిణ భాగం ప్రాజెక్టుపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ తెలంగాణకు గేమ్ ఛేంజర్‌గా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

రెండు ప్యాకేజీలుగా పనులు

ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. ఉత్తర భాగం 161.5 కిలోమీటర్లు ఉంటుది. సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లాలోని తంగడ్ పల్లి వరకు ఉంటుది. రూ.21 వేల కోట్ల ఖర్చుతో దీనిని నిర్మించేందుకు డీపీఆర్ సిద్దం చేశారు. త్వరలో పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించనున్నారు. ఇక దక్షిణ భాగం 201 కిలోమీటర్ల మేర ఉండనుంది. అంటే తంగడ్ పల్లి నుంచి సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ వరకు ఉంటుంది. ఉత్తర భాగం పనులతో పాటు దక్షిణ భాగం పనులు కూడా ఒకేసారి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుమతి కోసం కేంద్రానికి అనేక సార్లు రిక్వెస్టులు పంపంది. ఇప్పుడు ఎట్టకేలకు కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ స్వరూపమే మారనుంది. హైరదాబాద్‌కు పెద్ద మణిహరంగా మారనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *