తాజావార్తలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు


Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 25, 2026): మేష రాశి వారిఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశముంది. కుటుంబ జీవితం అన్ని విధాలా సామరస్యంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆదాయానికి లోటుండదు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆస్తి సంబంధమైన వ్యవ హారాల్లో సానుకూలతలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశముంది. కుటుంబ జీవితం అన్ని విధాలా సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఆర్థిక ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. కొందరు మిత్రుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఆస్తి, ఆర్థిక వివాదాల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులు, సహచరులతో సామరస్యం, ఆదరణ బాగా పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని చిన్నపాటి ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. ఆదాయంలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. పిల్లలు చదువుల్లో దూసుకుపోతారు. తలపెట్టిన వ్యవహారాలు, పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబానికి అవసరమైన వస్తు పరికరాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

శ్రమాధిక్యత ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సక్రమంగా, సజావుగా నిర్వర్తిస్తారు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభాలనిస్తాయి. అనవసర పరిచయాలకు కాస్తంత దూరంగా ఉండడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. అధికారుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతల మార్పులకు కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గట్టుగా లాభాలు గడిస్తారు. ప్రయాణాల వల్ల మంచి ఆశించిన ఫలితం ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలకు దిగకపోవడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లలు పైకి వస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

కన్య (ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో పనిభారం, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. అధికారులకు మీ ప్రతిభ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆశించిన శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితం చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అందుకు తగ్గ ప్రతిఫలం కూడా అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి, ఆర్థిక వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. తోబుట్టువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉత్సాహాన్నిచ్చే శుభవార్త అందుతుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ ఆశించిన స్థాయిలో కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభ దాయకంగా సాగిపోతాయి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత ఉంటుంది. కొందరు మిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి కెరీర్ కి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. తలపెట్టిన పనులు కొద్ది శ్రమతో పూర్త వుతాయి. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించకపోవడం మంచిది. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది. శత్రు, రోగ, రుణ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన అవకాశాలు అందుతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులను ప్రవేశ పెట్టి లాభాలు గడిస్తారు. ఇంటా బయటా కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కూడా మంచి కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి యథాతథంగా కొనసాగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులు, తోబుట్టువులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *