తాజావార్తలు

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. ఎంతంటే!

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. ఎంతంటే!


Gold Price Today: పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. ఎంతంటే!

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాకపోయినా, అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం ధరలు భారతదేశంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మార్చి 27, 2026 నాటికి దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అందునా చెన్నై వంటి నగరాల్లో బంగారం ధరలు దేశంలోనే గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం , రూపాయి విలువ పడిపోవడం బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. మార్చి 27 శుక్రవారం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.₹160 లు పెరిగి రూ. 1,44,710 కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 పెరిగి, రూ.1,32,650 పలుకుతోంది. కేజీ వెండిపై రూ.15,000లు తగ్గి రూ.2,45,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో శుక్రవారం బంగారం, వెండిధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,860 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,800 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,710 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,32,650 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,34,300 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,710 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,650 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,60,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూట్యూబ్‌ను ఊపేస్తున్న ‘కోసింది కొయగూర’ సాంగ్

Lokesh Kanagaraj: లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్

‘ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..’ చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!

ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా

సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *