తాజావార్తలు

Ginger – a cure for diseases


అల్లం రోగాలకు కళ్లెం

అల్లం ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

పరిగెత్తి పాలు తాగే బదులు, నిలబడి నీళ్లు తాగడం మేలు అని మన పెద్దలు ఊరికే అనలేదు.
అదేవిధంగా, ఆరోగ్యం విషయంలో చిన్న అలవాట్లు పెద్ద మార్పు తీసుకొస్తాయి.

మార్కెట్‌కు వెళ్తే ఖరీదైన కూరగాయలు, ఆహార దినుసులు కొనుగోలు చేస్తాం.
కానీ, కేవలం 10 రూపాయలిచ్చి అల్లం ముక్కను మాత్రం చాలామంది కొనరు.

అయితే, ఈసారి కూరగాయలు కొనడానికి వెళ్లినప్పుడు సంచిలో అల్లం లేకుండా వెనక్కి రాకండి.
ఎందుకంటే, మీ ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని కాపాడే శక్తి అల్లంకు ఉంది.

అందువల్ల, రోజువారీ ఆహారంలో అల్లంను ఏదో ఒక రూపంలో తినడం అలవాటు చేసుకోవాలి.

Ginger – a cure for diseases

అల్లం రోగాలకు కళ్లెం…

అల్లం కాఫీ

ఇప్పటి వరకు మీరు చాలాసార్లు అల్లం చాయ్ తాగుంటారు.https://youtu.be/zngmWPSUPKg అంతేకానీ, అల్లం కాఫీ మాత్రం తాగుండరు. కాఫీలోకి అల్లం ఏం బావుంటుంది? అనే సందేహం వద్దు. ఘుమఘుమలాడే కాఫీలోకి అల్లం ముక్క వేస్తే.. కారణంగా ఆ రుచే గమ్మత్తుగా ఉంటుంది.

అంతేకాక రుచి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది కానీ, ఆరోగ్యానికి మంచిదే! అల్లంలోని కొన్ని రసాయనాలకు జీర్ణవ్యవస్థను చక్కదిద్ది, పేవుల్ని శుభ్రపరిచే శక్తి ఉంది.

శరీరం లోపల పేరుకుపోయిన మలినాలను, వ్యర్థాలను (టాగ్జిన్స్)ను తొలగిస్తుంది అంతేకాక అల్లం – మరోవైపు కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా తక్షణ ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

http://అల్లం టీ తాగటం వలన కలిగే ప్రయోజనాలు.||Benefits of Drinking Ginger Tea.||Short.https://youtu.be/zngmWPSUPKg

రోజువారీ ఆహారంలో అల్లం ఎందుకు తప్పనిసరి అనే విషయాలను తెలుసుకోండి.

అల్లం స్మూతీ…..

ఉదయాన్నే ఇడ్లీ, వడ లేదా దోసెలను అల్పాహారంగా తీసుకుంటారు. కొన్నిసందర్భాల్లో తిన్న టిఫిన్ సరిగ్గా జీర్ణం అవ్వదు. ఎందుకంటే తిరిగి మధ్యాహ్న భోజనం సమయానికి ఆకలివేయదు. దీంతో భోజనాన్ని వదిలేయాల్సి వస్తుంది. అందుకని అల్పాహారం తిన్న వెంటనే అల్లం స్మూతీని తీసుకోండి.

మీకు ఇష్టమైన పండ్లరసంలోకి అల్లం రసాన్ని కలపడమే స్మూతీ. తక్షణ శక్తికి పండ్లరసం, సులభంగా జీర్ణం కావడానికి అల్లం ఉపకరిస్తాయి. కాబట్టి పంచదార తక్కువ వేసుకుని, రెండు మూడు స్పూన్ల అల్లం రసం జోడించిన స్మూతీని తాగండి. ఉదయం అద్భుతమైన శక్తి, ఉత్సాహం మీ సొంతం అవుతాయి.

శొంఠి కూడా..

అల్లంను ఎండబెడితే శొంఠి అవుతుంది. దీనిని పొడిగా నూరుకుని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అంతేకాక ప్రతిరోజూ ఒక స్పూను శొంఠి పొడిని వేడి వేడి అన్నంలోకి కలుపుకుని ఒక ముద్ద తినాలి. దీనివల్ల శరీరంలో వేడి, వాతం తగ్గుతాయి.

అజీర్తి వల్ల తలెత్తే గ్యాస్ తగ్గుతుంది. తిన్న ఆహారం కూడా సులువుగా జీర్ణం అవుతుంది. శొంఠిలోని ఔషధ కారకాలు జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచడమే కాకుండా.. తిన్న ఆహారాన్ని ఒంటికి పట్టేలా చేస్తుంది.

అల్లం జామ్

పిల్లలకు జామ్ అంటే చాలా ఇష్టం. అల్లం వంటివి వాడమంటే మూతి ముడుచుకుంటారు. ఇలాంటి పిల్లలకు అల్లంతో తయారుచేసిన జామ్ను ఇవ్వండి.

దీన్ని బ్రెడ్ మీద లేదంటే చపాతీలపై రాసుకుని తినొచ్చు. సాధారణ జామ్లకు బదులు అల్లంతో చేసిన జామ్ను అందిస్తే ఆరోగ్యానికి మంచిది.

ఒకవేళ మార్కెట్లో ఇలాంటి జామ్లు దొరక్కపోతే… ఇంట్లో చేసుకోవచ్చు. అల్లం జామ్ తినడం వల్ల చలికాలంలో పిల్లల్లో మందగించిన జీర్ణప్రక్రియ చురుగ్గా మారుతుంది.

అల్లం సిరప్….

సూపర్మార్కెట్లలో రకరకాల సిరప్లు దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో అల్లం సిరప్ తీసుకోండి. ఇది ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.

దీనిని జ్యూస్లు, పానీయాలు, కేకులలో వేసుకోవచ్చు. అల్లంలోని ఘాటు కొత్త రుచిని తీసుకొస్తుంది. ఎలాగూ అల్లం తిన్న అనుభూతి కలుగుతుంది.

బయట దొరికే అల్లం సిరప్లలో కృత్రిమ రంగులు కలిపే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఇంట్లోనే చేసుకోండి. బాగా మరిగే నీటిలో శుభ్రం చేసిన అల్లం వేసి.. అరగంటపాటు ఉడకబెట్టాలి. ఆ తరువాత వడగట్టుకోవాలి. ఇలా తయారైన అల్లం సిరప్ కొన్ని రోజులపాటు నిల్వ ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటే మేలు.

అల్లం పేస్ట్…

ఇక, అల్లం పేస్టు చెప్పనక్కర్లేదు. అయితే బయట దొరికే రెడీమేడ్ అల్లం పేస్టులను తప్పనిసరైతే తప్ప వాడొద్దు. ఇందులో నిల్వ ఉంచే రసాయనాలు కలుపుతున్నారు. వీటి వల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తుతాయి.

అల్లంపేస్టును వారానికి సరిపడా ఇంట్లోనే చేసుకోవాలి. ధరలు తక్కువగా ఉన్నప్పుడు అల్లం తీసుకుని, ఒకటికి రెండుసార్లు శుభ్రపరిచి, మిక్సీలో ఆడించాలి. దీన్ని గాలి చొరబడని గాజుసీసాలో భద్రపరిచి, ఫ్రిజ్లో ఉంచాలి.

అల్లం కూరల్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పూన్తో తీసుకుని వేసుకోవాలి. అల్లం పేస్టును కూరల్లో తరచూ వాడటం వల్ల సుఖవిరేచనం కలుగుతుంది. మలబద్దకం సమస్య తొలగుతుంది.

పేవుల్లో పేరుకున్న మలినాలు బయటికి సులభంగా వెళ్లిపోతాయి. అల్లంలోని ఔషధ రసాయనాలు ఉదరాన్ని కడిగిపారేస్తాయి.

వంటగదిలో తప్పనిసరి…ఎందుకంటే..

అల్లం ఎంత మంచిదంటే.. దీనిని పలు రూపాల్లో తరచూ తీసుకునేవాళ్లలో.. జీర్ణసంబంధ రుగ్మతలు రావు. మొండి వ్యాధులైన ఆర్థరైటిస్, క్యాన్సర్, మధుమేహం వంటివి రాకుండా అడ్డుకునే గుణం అల్లంకు ఉంది.

చివరగా నొప్పులు, వాపులు తగ్గుతాయి. చర్మ సౌందర్యం కూడా మెరుగవుతుంది.

సమగ్రంగా చూస్తే అల్లం జీవితంలో భాగం చేసుకోవాలి. అయితే మోతాదుకు మించి వాడొద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *