తాజావార్తలు

Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? అది ఎవరికి అసవరం? ఎలా తీసుకోవాలో తెలుసా?

Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? అది ఎవరికి అసవరం? ఎలా తీసుకోవాలో తెలుసా?


ఇండియాలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో డీమ్యాట్ అకౌంట్ (Demat Account) ప్రాముఖ్యత మరింత పెరిగింది. షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వంటి సెక్యూరిటీలను కాగితం రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా నిల్వ చేసే ఖాతానే డీమ్యాట్ అకౌంట్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పాత కాలంలో షేర్లు ఫిజికల్ సర్టిఫికేట్ల రూపంలో ఉండేవి. వాటి పోగొట్టుకోవడం, దెబ్బతినడం, ట్రాన్స్‌ఫర్ ఆలస్యం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి. ఈ సమస్యలకు పరిష్కారంగా డీమ్యాట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొనుగోలు చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి.

ఎందుకు అవసరం?

డీమ్యాట్ అకౌంట్ ఉండటం వల్ల పెట్టుబడిదారులు ఆన్‌లైన్‌లో సులభంగా షేర్లు కొనుగోలు, అమ్మకం చేయగలరు. ట్రాన్సాక్షన్లు వేగంగా పూర్తవుతాయి. అలాగే ఫిజికల్ పేపర్ల అవసరం లేకుండా సురక్షితంగా హోల్డింగ్స్ నిల్వ ఉంటాయి. డివిడెండ్లు, బోనస్ షేర్లు, స్ప్లిట్లు వంటి కార్పొరేట్ ప్రయోజనాలు ఆటోమేటిక్‌గా ఖాతాలో జమ అవుతాయి.

ఎలా ఓపెన్ చేయాలి?

బ్యాంకులు, స్టాక్ బ్రోకర్లు లేదా డిపాజిటరీ పార్టిసిపెంట్లు (DPలు) ద్వారా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో డీమ్యాట్ అకౌంట్ తెరవచ్చు. పాన్ కార్డ్, ఆధార్, బ్యాంక్ వివరాలు, ఫోటో వంటి KYC డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. మొత్తానికి డిజిటల్ యుగంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రతి ఒక్కరికీ డీమ్యాట్ అకౌంట్ ప్రాథమిక అవసరంగా మారిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సరైన అవగాహనతో ఈ ఖాతాను వినియోగిస్తే పెట్టుబడులను సురక్షితంగా నిర్వహించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *