తాజావార్తలు

AP Weather: బిగ్ అలెర్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు.. అటు తెలంగాణలో..

AP Weather: బిగ్ అలెర్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు.. అటు తెలంగాణలో..


AP Weather: బిగ్ అలెర్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు.. అటు తెలంగాణలో..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, వికారాబాద్, రంగారెడ్డి, వనపర్తిలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా… సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు, నాగర్‌ కర్నూలు, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని… అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, సత్యసాయి, అల్లూరి జిల్లాల్లో వానలు గట్టిగా పడుతున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరులో అకాల వర్షం వణికించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో రాజధాని పనులకు ఆటంకం ఏర్పడింది. పిడుగుపాటుకు ఒక వ్యక్తి చనిపోయాడు. అల్లూరి జిల్లా అరకు లోయలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో బయట అడుగుపెట్టే పరిస్థితి లేదు. అటు పాడేరులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కుండపోత వర్షం కురిసింది. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో కురిసిన వడగళ్ల వానకు ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. మరోవైపు పలుచోట్ల పంట నష్టం జరగడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.

మరో నాలుగు రోజులపాటు వర్షాలుంటాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు. వడగళ్ల వానలతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఏపీలో మూడు రోజులు ఓవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణం నెలకొననున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల,అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. ఆకస్మిక వర్షాలతో పడే పిడుగుపాటుపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు.   మొత్తంగా… అకాల వర్షాలు కొన్ని చోట్ల ఉపశమనం కలిగిస్తే… మరికొన్ని ప్రాంతాల్లో రైతులను దెబ్బతీస్తున్నాయి.

 

Also Read: హరికృష్ణ, నేను సిగరెట్ తాగుతూ ఎన్టీఆర్‌కి దొరికిపోయాం… ఆ తర్వాత

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *