ఆదివారం నాటి మరాఠ్వాడ నుంచి ఉత్తర అంతర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర కర్ణాటక నుండి కొమోరిన్ ప్రాంతం వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. మరోవైపు ఉత్తర తీరప్రాంత తమిళనాడుపై సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం…
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం
——————————————————–
సోమవారం, మంగళవారం :- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు గరిష్టముగా 60 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
————————–
సోమవారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
బుధవారం :- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు గరిష్టముగా 60 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
రాయలసీమ :-
————————–
సోమవారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు గరిష్టముగా 60 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ & యానాంలో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు. ఆ తదుపరి 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: పాత చీరలు బయట పడేస్తున్నారా..? అయ్యయ్యో ఇలా చేయొచ్చు కదా..!