తాజావార్తలు

Andhra: గాఢనిద్రలో ఉన్న రైతు.. వింత శబ్దంతో తుళ్లిపడి చూసేసరికి గుండె గుభేల్.!

Andhra: గాఢనిద్రలో ఉన్న రైతు.. వింత శబ్దంతో తుళ్లిపడి చూసేసరికి గుండె గుభేల్.!


Andhra: గాఢనిద్రలో ఉన్న రైతు.. వింత శబ్దంతో తుళ్లిపడి చూసేసరికి గుండె గుభేల్.!

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గదబూరులో అడుగుల గిరినాగు కలకలం సృష్టించింది. శేఖర్ అనే రైతుకు చెందిన పశువుల షెడ్డులో భారీ గిరినాగు కనిపించింది. పదమూడు అడుగుల గిరినాగు ఆహారం వెతుక్కుంటూ.. షెడ్డులో దూరింది. పశువుల పాకలోనే సేదతీరుతో నిద్రించాడు రైతు శేఖర్. గోడ నిద్రలో ఉన్న సమయంలో.. వింత శబ్దం వస్తుండడంతో శేఖర్ ఒక్కసారిగా తుళ్ళిపడి తొంగి చూశాడు. దీంతో ఆ భారీ గిరి నాగు తిష్ట వేసుకుని కూర్చుని కనిపించింది. దీంతో గుండెల్లో పట్టుకొని భయభ్రాంతులకు గురైన రైతు.. అక్కడ నుంచి పరుగులు తీశాడు. స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు స్థానికులు సమాచారం ఇచ్చారు. రంగంలో ఒక దిగిన స్నేక్ క్యాచర్.. రెండు గంటల పాటు శ్రమించి 13 అడుగుల గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడ నుంచి తీసుకెళ్లి.. అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *