తాజావార్తలు

Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో

Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో


ఓ వైపు డోలి పౌర్ణమి, మరోవైపు చంద్ర గ్రహణం రోజున శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇచ్చాపురం మండలం మండపల్లి పంచాయతీ, ఎం.తోటూరు గ్రామంలో ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. గ్రామంలోని కాళ్ళ.తులసిదాస్ అనే పాడి రైతు వద్ద సుమారు ఎనిమిది ఆవులు ఉన్నాయి. వాటిల్లో సిరి అనే ఆవు మంగళవారం ఉదయం మొదటి కాన్పులో మగ దూడను జన్మనిచ్చింది. ఆ దూడకు రెండు తలలు ఉండటంతో గ్రామం ఒక్కసారిగా వార్తలలోకి ఎక్కింది.

స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ అవును, దూడను చూసేందుకు ఆసక్తి చూపుతు క్యూకడుతున్నారు. ఈ వింత దూడను చూసేవారంతా దేవుడు మహిమగా భావిస్తున్నారు. పౌర్ణమి రోజున జన్మించటం, అది కూడా మగ దూడ పుట్టడంతో దత్తాత్రేయ స్వామివారి ప్రతి రూపంగా దూడను భావిస్తున్నారు. ఆవుకి, దూడకు దందాలు పెడుతూ భక్తి పారవశ్యంలో మునుగుతున్నారు.

వీడియో చూడండి..

కొన్ని దూడలకు వీపు భాగంలో కూడా అదనపు కాలు ఉండటం కొన్ని సందర్భాల్లో చూసే ఉంటారు. అయితే అవి కూడా మహిమ గల ఆవులుగా చెప్పుకునే వారు. కాశీ ఆవులనీ వాటిని పిలిచేవారు. అయితే ఇలా రెండు తలలతో దూడ పుట్టడం కొంత అరుదనే చెప్పాలి. అయితే వైద్యులు మాత్రం ఆధ్యాత్మిక వాదనలను ఖండిస్తున్నారు. జన్యుపరమైన లోపం వల్ల ఇలాంటి దూడలు అరుదుగా జన్మిస్తూ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *