చలిలో జలుబు – {Cold in the cold}
Cold in the Cold: How Extreme Winter Affects Daily Life

చలిలో https://a2zchronicle.com/
చల్లగాలిలో తిరిగినా, చల్లటి వాతావరణంలో ఎక్కువ సేపు ఉన్నా. త్వరగా జలుబు చేయటమన్నది మనలో చాలామందికి అనుభవమే.
అయితే ఇన్నాళ్లుగా వైద్యరంగం దీని అంతగా గుర్తించడం లేదు.
చలిలో జలుబు ప్రధానంగా వైరస్ ల వల్ల వచ్చేదనీ… చలిలోకి వెళ్ళినంత మాత్రాన జలుబు చేస్తుందనటానికి ఆధారాలేవని ఇన్నాళ్ళుగా వైద్యులు అంటున్నారు.
అయితే చలిలోకి వెళితే జలుబు చేసే మాట నిజమేనని ఇటీవల పరిశోధకులు తొలిసారిగా, అధ్యయన పూర్వకంగా నిరూపించారు.
చలి బాగా ఉన్నప్పుడు
చలి బాగా ఉన్నప్పుడు తప్పని సరైతే తప్ప బయటి పనులకు వెళ్ళం. వీలైనంత వరకూ ఇంట్లోనో లేక ఆఫీసులోనో ఉండి పోవటానికి ప్రయత్నిస్తుంటాం.
లోపలోపలే ఉండి పోవటం వల్ల… చలిలో… జలుబు బయట చల్లగా ఉన్నప్పుడు ఇలా అంతా కారక వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపిస్తుందనీ, చలికాలంలో తరచూ జలుబుకు కారణం ఇదేననీ చాలా కాలంగా నిపుణులు వాదిస్తున్నారు. https://youtu.be/FfRzpJrz0aI{ఎక్కవగా జలుబు ఉన్నపుడు ఈ టిప్ పాటిచండి}
ప్రత్యక్షంగా చలిలోకి వెళ్ళినంత మాత్రాన జలుబు రాదన్నది ఇన్నేళ్ళుగా వీరి అభిప్రాయం.
నిజానికి 1950ల నుంచీ కూడా దీనిపై అప్పుడప్పుడు రకరకాలుగా అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయిగానీ… ఫలితాల్లో అంతగా స్పష్టత లేదు.
ఈ నేపథ్యంలో నిజానిజాలు తేల్చేందుకు ఇటీవలే ఇంగ్లండ్‌లోని ‘కామన్ కోల్డ్ సెంటర్’ పరిశోధకులు పెద్ద ప్రయత్నం చేశారు.
వీరు దాదాపు 180 మంది ఆరోగ్యవంతులను తీసుకుని… కొందరిని బాగా చల్లగా ఉన్న వాతావరణంలోనూ, మిగిలిన వారిని సాధారణ వాతావరణంలోనూ ఉంచారు.
ఐదు రోజుల తర్వాత చూస్తే – చల్లటి వాతావరణంలో ఉన్న 29 శాతం మందిలో ముక్కు కారటం, గొంతు నొప్పి, జలుబు లక్షణాలు కనిపించగా, మిగతా వారిలో కేవలం 10 శాతం మందిలోనే ఇలాంటి లక్షణాలున్నట్లు గుర్తించారు.
దీన్నిబట్టి సాధారణ పరిస్థితుల్లో ఉన్నవారితో పోలిస్తే చల్లని వాతావరణంలో ఉన్న వారికి త్వరగా జలుబు చేసే మాట నిజమేనని పరిశోధకులు నిర్థారణకు వచ్చారు.
శారీరక ఉష్ణోగ్రత తగ్గటమే ఇలా త్వరగా జలుబు చెయ్యటానికి కారణమని వీరు భావిస్తున్నారు. .https://youtube.com/shorts/_zufumVy-5M (coldfunny video}
జలుబుకు నివారణ ఉందా?
జలుబు దగ్గుల బారిన తరచూ పడకుండా ఉండాలంటే వాటిని కలిగించే వైరస్‌లను ఎదుర్కొనే శక్తి మన శరీరానికి ఉండాలి.
అందుకు చేయాల్సింది…
అందుకు చేయాల్సింది…
చేతులను తరచుగా కడుక్కుంటూ ఉండాలి. అరచేతులను మాత్రమే కాకుండా చేతుల వెనక భాగాన్ని, వేళ్ళ మధ్య కూడా శుభ్రంగా కడుక్కోవాలి.https://studio.youtube.com/video/gV5sHnOMHJ8/edit{పిల్లల జలుబు ఉపశమనానికి చిట్కాలు}
తలుపులకు వాడే గడలను, లోహపు పిడిలను, టెలిఫోన్ పరికరాన్ని, స్విచ్‌బోర్డులను వేడినీటిలో సబ్బు కలిపి ఆ ద్రావణంలో తుడుస్తుండాలి.
దగ్గేటప్పుడు, చీదేటప్పుడు రుమాలును వాడండి. తుమ్మేటప్పుడు కూడా చేతిని, లేదా రుమాలుని అడ్డుపెట్టుకోండి. మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఈ జాగ్రత్త పాటించేలా చూడండి.
పదే పదే ముఖాన్ని చేతులతో తుడుచుకుంటూ ఉండొద్దు. ముక్కు, కళ్ళు, నోటి ద్వారానే వైరస్లు ఎక్కువగా శరీరంలోకి చేరతాయి.
తగినంత విశ్రాంతి ఉండేలా చూసుకోవాలి.
నడవడం, జాగింగ్ లాంటి వ్యాయామాల్లో ఏదో ఒకదానిని ఎంచుకుని క్రమం తప్పక చేయండిhttps://youtube.com/shorts/KzSTqsWuw9A.{దగ్గు మరియు జలుబు …లక్షణాలు తగ్గడానికి.🙏}
సమతుల, పోషకాహారాన్ని తీసుకోవడం ముఖ్యం. రోజూ పళ్ళు, కూరగాయలు తీసుకుంటూ పది పెద్దగ్లాసుల నీళ్ళు తాగండి.
మొదట్లో క్రోసిన్, మెటాసిన్ వంటి బిళ్ళలు తడవకి రెండు చొప్పున రోజుకి మూడుసార్లు వాడాలి. వాటితో జ్వరం తగ్గిపోతే సరేసరి. జ్వరం తగ్గకుండా వుంటే టెర్రామైసిన్వంటి యాంటీబయాటిక్స్ ప్రతీ ఆరు గంటలకి ఒకటి చొప్పున వేసుకోవాలి.
ఒక్కోసారి మామూలు జ్వరం అనుకున్నదే తెలియకుండా దుష్ఫలితాలని కలిగిస్తుంది. https://youtube.com/shorts/wbZp6l_R3pE {దగ్గు,జలుబు తగ్గి స్వశానాలలు శుబ్రపడాలంటే}

అందుకని త్వరగా తగ్గకపోతే డాక్టరుకి చూపించి చికిత్స పొందాలి.
