
పెళ్లికి ముందయినా, పెళ్లి తర్వాతైనా కలిసి ప్లాన్ చేసుకోవడం వరకు ఓకే, కలిసి ఉండేలా ప్లాన్ చేసుకోవడం మాత్రం సమ్‌థింగ్ డిఫరెంట్.అలాంటిది అప్పట్లో ఆలియాకు కుదిరింది.. ఇప్పుడు రష్మికకు కుదిరింది అంటూ పోల్చి చూస్తున్నారు నెటిజన్లు. ప్రతి రోజూ ఏదో ఒక టాపిక్ తో ఫ్లాష్ అవుతున్న విరోష్ ఇప్పుడు ఆలియాతో కలిసి ఎందుకు ట్రెండ్ అవుతున్నారు. నాకు సాయంత్రాలంటే ఇష్టం. గోల్డెన్ అవర్ని అసలు మిస్ కాను అంటూ మనసులోని ఇష్టాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారీ పంచుకుంటూ ఉంటారు ఆలియాభట్. జస్ట్ గోల్డెన్ అవర్ని మాత్రమే కాదు, రణ్‌బీర్‌తో కలిసి స్పెండ్ చేసే అవకాశం వచ్చిన ఏ అవకాశాన్నీ మిస్ చేసుకోరు ఆలియా. పెళ్లి చేసుకోవాలనుకున్న సందర్భంలో వారిద్దరూ కలిసి బ్రహ్మాస్త్ర షూట్లో టైమ్ స్పెండ్ చేసిన విషయాన్ని ఇష్టంగా గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు. ఆలియా – రణ్‌బీర్ కెరీర్లలో ఎన్ని సినిమాలు కలిసి చేసినా బ్రహ్మాస్త్ర సమ్‌థింగ్ స్పెషల్ అన్నది వారి మనసుల్లో ఉన్న మాట. వారిని అభిమానించేవారు ఒప్పుకునే విషయం. వారికి బ్రహ్మాస్త్ర అలా గుర్తుండిపోతుందో, అలా విరోష్ కి రణబాలీ గుర్తుండిపోతుంది. పెళ్లయ్యాక విజయ్ దేవరకొండ ఫస్ట్ అడుగుపెట్టిన సెట్ రణబాలీ. ఆఫ్టర్ మేరేజ్ రష్మిక మందన్న మైసా సెట్‌కి వెళ్లారు. కానీ, ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ రణబాలీ షూట్లోనే ఉన్నారు. ఈ ఏడాది రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండకి, రష్మిక మందన్నకి చాలా స్పెషల్. ఆల్రెడీ రిలీజ్ అయిన ఏందయ్యా సామి పాట తెగ వైరల్ అవుతోంది. సినిమా కూడా ఇదే రేంజ్లో ఆకట్టుకుంటుందని వెయిట్ చేస్తున్నారు విజయ్ అండ్ రష్మిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యష్ ముందుకొస్తే.. విజయ్ వెనక్కి జరుగుతారా ??
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!
చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్ ప్రియురాలు
