తాజావార్తలు

మహిళల ఆరోగ్యానికి ఇవి శ్రీరామ రక్ష.. రోజూ తీసుకుంటే ఊహించని అద్భుతాలు..

మహిళల ఆరోగ్యానికి ఇవి శ్రీరామ రక్ష.. రోజూ తీసుకుంటే ఊహించని అద్భుతాలు..


మహిళల ఆరోగ్యానికి ఇవి శ్రీరామ రక్ష.. రోజూ తీసుకుంటే ఊహించని అద్భుతాలు..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు రెట్టింపు బాధ్యతలను మోస్తున్నారు. అటు ఆఫీసు పని, ఇటు ఇంటి బాధ్యతలను చక్కబెట్టే క్రమంలో తమ సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం పరిపాటిగా మారింది. ఫలితంగా చిన్న వయసులోనే తీవ్రమైన అలసట, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నింటికీ మన పురాతన ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయని ప్రముఖ హెల్త్ కోచ్ డింపుల్ జాంగ్డా సూచిస్తున్నారు. ప్రతి మహిళ తన ఆహారంలో భాగం చేసుకోవాల్సిన మూడు ముఖ్యమైన మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అశ్వగంధ

అశ్వగంధను కేవలం పురుషులకే పరిమితమైన మూలికగా చాలామంది భావిస్తారు. కానీ ఇది మహిళలకు ఒక సంజీవని లాంటిది. దీనిని అడాప్టోజెన్ అని పిలుస్తారు. ఇది శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను తగ్గించి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరచడంలో, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మార్కెట్లో లభించే అశ్వగంధ పొడిని గోరువెచ్చని పాలలో కలుపుకుని లేదా హర్బల్ టీ రూపంలో తీసుకోవచ్చు.

శతావరి (ఆస్పరాగస్): స్త్రీలకు అసలైన నేస్తం

ఆయుర్వేదంలో శతావరికి ఉన్న ప్రత్యేకతే వేరు. వంద రోగాలను నయం చేసే శక్తి దీని సొంతం. పీసీఓఎస్, సంతానలేమి, క్రమరహిత రుతుస్రావం వంటి సమస్యలతో బాధపడే మహిళలకు శతావరి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. మీరు గర్భం దాల్చాలని ప్లాన్ చేస్తున్నా లేదా మెనోపాజ్‌లో ఉన్నా, శతావరి హార్మోన్లను అదుపులో ఉంచుతుంది. బాలింతలలో పాల ఉత్పత్తిని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. శతావరి పొడిని పాలు లేదా తేనెతో కలిపి రోజుకు ఒకసారి తీసుకోవడం శ్రేయస్కరం.

తులసి: మానసిక ఉల్లాసానికి మారుపేరు

ప్రతి ఇంట్లో ఉండే తులసి కేవలం పూజకే కాదు, ఔషధ గుణాల గని కూడా. తులసి శరీరంలో సెరోటోనిన్ విడుదలకు దోహదపడుతుంది. ఇది ఆందోళన, నిరాశను దూరం చేసి మనసును ఉల్లాసంగా ఉంచుతుంది.ఇది శరీరంలోని జీర్ణ అగ్నిని ప్రేరేపించి, జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారికి, నీరసంగా ఉండేవారికి మంచి ఫలితం ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 3-4 ఆకులను నమలడం లేదా తులసి టీ తాగడం వల్ల ఊపిరితిత్తులు, జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటాయి.

ముఖ్య గమనిక: నిపుణుల సూచన

ఆయుర్వేద మూలికలు సహజమైనవే అయినప్పటికీ, ప్రతి ఒక్కరి శరీర తత్వం వేరుగా ఉంటుంది. కాబట్టి వీటిని మీ దినచర్యలో భాగం చేసుకునే ముందు ఒకసారి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ముఖ్యంగా గర్భిణీలు, ఇతర మందులు వాడుతున్న వారు సరైన మోతాదు కోసం నిపుణుల సలహా తీసుకోవాలి.

ఆరోగ్యం అనేది బాధ్యత మాత్రమే కాదు, అది ఒక పెట్టుబడి. మహిళలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టినప్పుడే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మూడు మూలికలను సరైన పద్ధతిలో వాడి సహజసిద్ధమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *