తాజావార్తలు

పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్‌

పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్‌


పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్‌

ఉగ్రవాద కార్యాకలాపాలకు సంబంధించి అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ సంచలన నివేదికను బయటపెట్టింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల గురించి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకున్న వాటి గురించి వివరించింది. దీంతో భారతదేశానికి చాలాకాలంగా ఉన్న ఆందోళనలను మరోసారి రేకెత్తించింది. తన నివేదికలో అనేక తీవ్రవాద గ్రూపులను ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ నివేదిక లష్కర్-ఎ-తైబా, జైష్-ఎ-మహ్మద్, హర్కత్-ఉల్-జిహాద్ ఇస్లామీ, హర్కత్-ఉల్-ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు భారతదేశం తోపాటు కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఇవి పాకిస్తాన్ భూభాగం నుండి తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ, నిరంతర భద్రతా సవాళ్లను విసురుతున్నాయని నివేదిక వెల్లడించింది..

ఈ విశ్లేషణ ప్రకారం, పాకిస్తాన్ అనేక సాయుధ ప్రభుత్వేతర సమూహాలకు కేంద్రంగానూ, లక్ష్యంగానూ కొనసాగుతోంది. వీటిలో చాలా గ్రూపులు 1980ల నుండి చురుకుగా ఉన్నాయి. అమెరికా, ఐక్యరాజ్యసమితిలు ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన ఈ ఉగ్రవాద గ్రూపుల నెట్‌వర్క్‌లను పదేపదే సైనిక చర్యలు, విధానపరమైన చర్యలు చేపట్టినప్పటికీ పూర్తిగా నిర్మూలించలేకపోయారని నివేదిక పేర్కొంది.

అమెరికా చట్టసభ సభ్యులకు సమాచారం అందించే ఉద్దేశ్యంతో, దక్షిణాసియా నిపుణుడు కె. అలన్ క్రోన్‌స్టాడ్ రూపొందించిన ఈ నివేదిక, ఈ గ్రూపులను ఐదు వర్గాలుగా విభజిస్తుంది: ప్రపంచవ్యాప్తంగా చురుకుగా ఉన్నవి, ఆఫ్ఘనిస్తాన్‌పై దృష్టి సారించినవి, భారతదేశం – కాశ్మీర్‌పై దృష్టి సారించినవి, దేశీయంగా చురుకుగా ఉన్నవి, మతతత్వపరమైనవిగా పేర్కొన్నారు. ఈ జాబితాలోని 15 గ్రూపులలో 12, ​​అమెరికా చట్టం ప్రకారం “విదేశీ ఉగ్రవాద సంస్థలు”గా గుర్తించబడ్డాయని నివేదిక పేర్కొంది. ఈ గ్రూపులలో చాలా వరకు ఇస్లామిక్ మౌలికవాద భావజాలాలచే ప్రేరేపించబడుతున్నట్లు గుర్తించారు.

ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న గ్రూపులలో, ఈ నివేదిక అల్-ఖైదా, అల్-ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS), ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP)లను పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌పై దృష్టి సారించిన సమూహాలలో తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్ ఉన్నాయి. దేశీయంగా చురుకుగా ఉన్న సంస్థలలో తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, జైష్ అల్-అద్ల్ ఉండగా, మతతత్వ సమూహాలలో సెపా-ఎ-సహాబా పాకిస్తాన్, లష్కర్-ఎ-ఝాంగ్వీ ఉన్నాయి.

దేశంలో ఏ సాయుధ మిలీషియాలు కూడా చురుకుగా ఉండకుండా చూడటమే 2014 జాతీయ కార్యాచరణ ప్రణాళిక లక్ష్యమని ఆ నివేదిక పేర్కొంది. అయితే, వైమానిక దాడులు, నిఘా ఆధారిత కార్యకలాపాలతో సహా అనేక భారీ సైనిక చర్యలు చేపట్టినప్పటికీ, ఈ బృందాలు పూర్తిగా నిర్మూలించలేపోయారని ఆ నివేదిక పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *