టమాటా పుదీనా చట్నీ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు. ఇది వేడి వేడి దోశ, ఇడ్లీ అన్నంలోకి అదిరిపోతోంది. ఆంధ్రాలో వారంలో మూడు సార్లు తింటారు. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
కావాల్సిన పదార్ధాలు : 10 పచ్చిమిర్చి, నాలుగు టమాటాలు , పుదీనా కట్ట , రెండు టేబుల్ స్పూన్స్ చింతపండు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, పసుపును తీసుకోవాలి.
ఈ చట్నీని తక్కువ నూనెతో చేసుకుంటే రుచి అదిరిపోతోంది. మూడు టేబుల్ స్పూన్స్ నూనెలో ఉడకబెట్టిన టమాటాలు, పుదీనా మిశ్రమాన్ని మెత్తగా పట్టుకుని, పోపు పెడితే చట్నీ రెడీ అవుతుంది.
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో రెండు నూనె వేసి, 5 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పుదీనా ఆకులు, కట్ చేసిన కోసిన టమాటాలు, రెండు టేబుల్ స్పూన్స్ చింతపండు రసం వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి.
ఈ మిశ్రమం కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లో కానీ రోటిలో కానీ వేసి రుబ్బుకోవాలి. మధ్యలో వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచిన పోపు పెట్టుకోవడమే. ఆ తర్వాత వేడి అన్నంలో తింటే నోటికి రుచిగా ఉంటుంది.





