తాజావార్తలు

ఉగాది శుభకార్యాలు: ఇలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ కటాక్షం.. డబ్బు లోటు ఉండదు!

ఉగాది శుభకార్యాలు: ఇలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ కటాక్షం..  డబ్బు లోటు ఉండదు!


ఉగాది శుభకార్యాలు: ఇలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ కటాక్షం..  డబ్బు లోటు ఉండదు!

మార్చి 19, 2026 గురువారం నాడు తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగను జరుపుకోనున్నాం. అయితే, ఈ రోజున ఉదయం 6:55 గంటల వరకు ఫాల్గుణ అమావాస్య గడియలు ఉన్నందున, ఉగాది పనులన్నీ ఉదయం 7 గంటల తర్వాతే ప్రారంభించాలి. శుభ్రత పనులు, పూజా గది అలంకరణ కూడా ఉదయం 7 గంటల తర్వాతే చేపట్టాలి. ఉగాది రోజున ఏ దేవుడినైనా పూజించవచ్చు, కానీ ముఖ్యంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి.

నెగటివ్ ఎనర్జీని తొలగించి..

పండుగ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం ఆనవాయితీ. తలకు, శరీరానికి నువ్వుల నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమ పెట్టి మామిడి తోరణాలతో అలంకరించాలి. మామిడి తోరణాలు నెగటివ్ ఎనర్జీని తొలగించి దైవాకర్షణను పెంచుతాయి. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పూజ గదిలో బియ్యప్పిండితో ముగ్గు వేసి దీపారాధన చేయాలి.

అఖండ ఐశ్వర్య ప్రాప్తి..

ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య ఇంట్లో పూజ చేసుకోవడం అత్యంత శుభప్రదం. ఉగాది రోజున పాలు పొంగించి, ఆ పాలతో పాయసం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని ప్రతీతి. పూజలో పసుపుతో చేసిన చిన్న గణపతిని పూజిస్తే సంవత్సరమంతా పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు లభిస్తాయి. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పూజలో మీ పేరు, గోత్రం చెప్పుకుని కుటుంబం బాగుండాలని సంకల్పం చెప్పుకోవాలి.

అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు

షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని (బెల్లం, చింతపండు, వేప పువ్వులు, పచ్చి మామిడి ముక్కలు, ఉప్పు, కారం) తయారు చేసి, దేవునికి నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులంతా స్వీకరించాలి. ఉగాది పచ్చడిని తయారు చేసే ఆడవారు ఉదయం ఉపవాసం ఉండి, పూజ పూర్తయిన తర్వాతనే స్వీకరించాలి. కొత్త మట్టికుండలో ఉగాది పచ్చడిని తయారు చేయడం అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలను ఇస్తుంది. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి, ఉగాది రోజున గోమాతకు అరటి పండ్లు లేదా పచ్చి గడ్డిని ఆహారంగా తినిపించడం వల్ల పాపాలు తొలగి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది.

మహాలక్ష్మీదేవి స్థిర నివాసం

నూతన పంచాంగాన్ని కొని పూజ గదిలో దేవుని చిత్రపటాల వద్ద ఉంచి పూజిస్తే గ్రహదోషాలు లేకుండా ఐశ్వర్యం కలిసి వస్తుంది. రాళ్ల ఉప్పుతో ఐశ్వర్య దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని దారిద్ర్య బాధలు తొలగి మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కట్టుకోవడం నరపీడను తొలగించి మహాలక్ష్మి కటాక్షాన్ని అందిస్తుంది. వివాహమైన ఆడవారు తులసికోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే దీర్ఘసుమంగళీ యోగం కలుగుతుంది. ఐదుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వడం వల్ల కుటుంబానికి మంచి జరుగుతుంది.

ధన లాభాలు

అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడానికి బీరువాలో లేదా పర్సులో పచ్చ కర్పూరం పెట్టుకోవాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, విజయాలు కలుగుతాయి. స్తోమతను బట్టి పేదవారికి దానం చేయడం రెట్టింపు పుణ్యఫలితాన్నిస్తుంది. ఉగాది రోజున ప్రతి నిమిషం శుభముహూర్తమే కాబట్టి, కొత్త పనులు ప్రారంభిస్తే ఆటంకాలు లేకుండా విజయవంతమవుతాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు పూజ గదిలో కుబేర ముగ్గు వేసి దీపం వెలిగిస్తే ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. దేవాలయ సందర్శనం, గణపతికి గరిక సమర్పించడం ద్వారా శుభాలు కలుగుతాయి. బ్రాహ్మణులకు మట్టికుండ దానం చేస్తే ధనధాన్యాలకు కొరత ఉండదు.

ఆదాయం వృద్ధి

సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి ముందు శుభ్రం చేసి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగిస్తే మహాలక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఉగాది రోజున జుట్టు, గోళ్లు కత్తిరించడం, మాంసాహారం తినడం, మధ్యాహ్నం నిద్రపోవడం, భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించకపోవడం వంటివి దరిద్ర దేవతను ఆహ్వానిస్తాయి. ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవడం ద్వారా దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైన తమలపాకులను దీపారాధన సమయంలో ఉంచితే ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది. గురువారం ఉగాది వచ్చినందున, దక్షిణామూర్తి స్తోత్రం చదవడం విద్యార్థులకు, వ్యాపారస్తులకు శుభకరం. శని దోషాలతో బాధపడేవారు రావిచెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే దోషాలు తొలగిపోతాయి. సాయంత్రం 6 నుండి 7 గంటల సమయంలో తథాస్తు దేవతలు సంచరిస్తారు కాబట్టి, దీపం వెలిగించి మనసులో కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి. ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఈ ఏడాదంతా ఐశ్వర్యం, ఆనందం, శుభాలు కలుగుతాయి.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *