తాజావార్తలు

విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు

విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు


విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు

పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పుడు సామాన్యుల ప్రయాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరు దేశాల మధ్య క్షిపణి దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా ప్రముఖ భారతీయ విమానయాన సంస్థలు మార్చి 15 ఆదివారం తమ సర్వీసులను భారీగా రద్దు చేశాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో సంస్థలు గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పలు విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి వంటి కీలక నగరాలకు వెళ్లే ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా గగనతలం అస్థిరంగా మారడం, యూఏఈ ప్రభుత్వం విమానాశ్రయాలపై కఠిన ఆంక్షలు విధించడమే దీనికి ప్రధాన కారణమని విమానయాన సంస్థలు తెలిపాయి. విమానాలు రద్దైన నేపథ్యంలో ప్రయాణికులకు పూర్తి రిఫండ్ లేదా తదుపరి అందుబాటులో ఉన్న విమానాల్లో ఉచితంగా టికెట్ మార్చుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు విమానయాన సంస్థల అధికారిక వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా తమ ఫ్లైట్ స్టేటస్‌ను సరిచూసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇరాన్-అమెరికా మధ్య క్షిపణి దాడులు జరుగుతున్న తరుణంలో యూఏఈ ప్రభుత్వం తమ గగనతలం, విమానాశ్రయాలపై కఠిన ఆంక్షలు విధించింది. క్షిపణుల ముప్పు పొంచి ఉన్నందున అంతర్జాతీయ విమానాల రాకపోకలను పరిమితం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు

దారుణం.. నలుగురి ప్రాణం తీసిన పొగ..

Dubai: యుద్ధం దెబ్బకు ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌.. మొత్తం గంగార్పణం

భూగర్భంలో ఇరాన్‌ ‘మిస్సైల్‌ సిటీ’.. అమెరికాకు కొత్త సవాళ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *