కావాల్సిన పదార్ధాలు : రెండు పెద్ద దోసకాయలు, రెండు పెరుగు కప్పులు 5 పచ్చిమిర్చి, రుచికి తగినంత
ఉప్పు, అర కట్ట కొత్తిమీర, అర కప్పు నూనె, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 10 కరివేపాకు ఆకులు, 10 ఎండు మిర్చిని తెలుసుకోవాలి.
ముందుగా దోసకాయ తీసుకుని దాని పై తొక్కను తీసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్త గిన్నెను తీసుకుని రెండు కప్పులు పెరుగు వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
పెరుగు మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత దోసకాయ ముక్కలు , కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్లో ఆయిల్ వేసి అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిర్చి, కరివేపాకు ఆకులు వేసి పోపు వేసుకోవాలి. ఈ తాలింపును దోసకాయ పెరుగు పచ్చడిలో వేసి మిక్స్ అయ్యేలా బాగా కలపాలి.
చివర్లో కొత్తిమీర ఆకులు వేసి వాటిని బాగా కలిపితే అదిరిపోయే టేస్టీ టేస్టీ దోసకాయ పెరుగు పచ్చడి సిద్ధం అవుతుంది. ఇది వేడి వేడి అన్నంలో తింటే మరింత టేస్టీగా ఉంటుంది.





