
చేయబోయే సినిమాల గురించే కాదు, ఆల్రెడీ రిలీజ్ అయి క్లిక్ అయిన సినిమాల గురించిన వార్తలు కూడా సూపర్ కిక్ ఇస్తాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి ప్రీవియస్ ఫిల్మ్స్ కి సంబంధించిన ఇన్‌సైడ్ విషయాలు అలాగే వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంటవి? తానెప్పుడూ అవార్డులు అందుకోవాలనే లక్ష్యంతో కథలు రాసుకోలేదన్నది అనిల్ రావిపూడి చెప్పే మాట. భగవంత్ కేసరి సినిమాకు కూడా జాతీయ పురస్కారం వస్తుందనిగానీ, రావాలనిగానీ ముందు ఊహించలేదని అన్నారు. అనకున్నది అనుకున్నట్టు నిజాయతీగా తెరకెక్కించడమే తన స్టైల్.. దానికి గుర్తింపు దక్కడం మహదానందం అంటున్నారీ కెప్టెన్.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆ సినిమా ప్లాప్.. దెబ్బకు రోడ్డున పడ్డా.. కార్లు అమ్ముకున్నా.. టాలీవుడ్
సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలోనూ స్క్రీన్ ప్లే కీ రోల్ ప్లే చేసిందట. పాపా పాండేని ఐశ్వర్యరాజేష్ తోసేసే సీన్‌ని ముందు ఇంటర్వెల్‌లో ప్లాన్ చేశారట. అయితే అప్పటికే ఫస్టాఫ్ స్టఫ్డ్ గా ఉండటంతో, సెకండ్ హాఫ్‌కి షిఫ్ట్ చేశారట. సరికొత్త కంటెంట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇంక్లూడ్ చేసే అనిల్ రావిపూడి… వెంకటేష్ – కల్యాణ్ రామ్ సినిమాను కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. జూన్, జులై నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. నవంబర్‌కి కంప్లీట్ చేసి, వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..
ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..
