తాజావార్తలు

పచ్చని కాపురంలో సాంబార్ చిచ్చు.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య.. ఏం చేసిందంటే?

పచ్చని కాపురంలో సాంబార్ చిచ్చు.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య.. ఏం చేసిందంటే?


పచ్చని కాపురంలో సాంబార్ చిచ్చు.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య.. ఏం చేసిందంటే?

కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగిన చిన్న గొడవ పెద్ద విషాదానికి దారితీసింది. సాంబార్ వంటకంపై జరిగిన వాగ్వాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే బెంగుళూరు నగరానికి చెందిన 27 ఏళ్ల కావ్య అనే యువతికి రంగస్వామి అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల భార్య భర్తల మధ్య వంటకాల విషయంలో వాగ్వాధం చెలరేగింది.

నివేదికల ప్రకారం.. కావ్య మూడు రోజుల క్రితం ఇంట్లో విందు కోసం సాంబార్ వండింది. ఆరోజు నుంచి ఆమె అదే సాంబార్‌ను ప్రిజ్‌లో పెట్టి మళ్లీ మళ్లీ రెండ్రోజులుగా తనకు వడ్డిస్తున్నట్లు భర్త ఆరోపించాడు. ఇదే అంశంపై భర్త భార్యను నిలదీశాడు. ఈ విషయం పై ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కావ్య కోపంతో బాత్రూమ్‌లోకి వెళ్లి పొలాల కోసం తెచ్చి పెట్టిన పురుగుల మందు తాగింది. దీంతో అక్కడే పడిపోయింది.

ఎంతసేపటికి భార్య బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త బాత్‌రూమ్ డోర్ బద్దల కొట్టి చూడగా లోపల ఆమె అపస్మారక స్థితిలో పడి కనిపించింది. దీంతో కంగారుపడిపోయిన భర్త వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించాడు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు వైద్యం అందించంగా.. చికిత్స పొందుతూనే ఆమె ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *