తాజావార్తలు

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క.. అభివృద్ధిపై తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క..  అభివృద్ధిపై తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి


ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క..  అభివృద్ధిపై తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క.. తగ్గేదేలే.. ఇదీ హైదరాబాద్‌ సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి పక్కా ప్లానింగ్‌.. భాగ్యనగరం భవిష్యత్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన ఆయన.. కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌ ప్రారంభోత్సవంలో సిటీ నెక్ట్స్‌ లెవల్‌ వ్యూపై క్లియర్‌ పిక్చర్‌ ప్రకటించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలెప్‌మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇబ్బందులు ఎదురైనా.. వరల్డ్‌ క్లాస్‌ సిటీ నిర్మించి తీరుతామని చెప్తుండడం ఆసక్తి రేపుతోంది. బుద్వేల్ లేఅవుట్‌తో కలిపే రేడియల్ రోడ్-2 ఇంటర్‌చేంజ్‌కు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.అనంతరం కొత్వాలగూడలో ఎకో పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైదరాబాద్‌ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పెషల్‌ పెడుతూ వస్తున్నారు. ఏకంగా.. హైదరాబాద్‌కు అనుబంధంగా ఓ కొత్త నగరాన్నే నిర్మించేందుకు అడుగులు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మనసులో ఉన్న హైదరాబాద్ మహానగర సమగ్రాభివృద్ధి ఆలోచనను మరోసారి బయటపెట్టారు. అయితే.. సిటీ డెవలెప్‌మెంట్‌లో ఎలాంటి అనుకూల పరిస్థితులు.. ప్రతికూలతలు ఉన్నాయో వెల్లడించారు. మార్పులకు అనుగుణంగానే భారత్‌ ఫ్యూచర్‌ నిర్మాణం జరుగుతుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మూసీ మురికికి స్వస్తీ చెప్పాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

వచ్చే ఐదేళ్లలో బుల్లెట్‌ ట్రైన్‌ పరుగులకు శంషాబాద్‌ అతిపెద్ద జంక్షన్‌ కాబోతందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వాసితులు ఎవరికీ నష్టం జరగకుండా అందరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే.. అభివృద్ధి జరిగేటప్పుడు కొంత భూములు కోల్పోవడం కామన్‌ అని.. భూములు ఇస్తేనే మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు. వరల్డ్‌ క్లాస్‌ డెవలెప్‌మెంట్‌ ఎలా ఉంటుందో భారత్‌ ఫ్యూచర్‌ సిటీతో చూపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. భూములు ఇచ్చే బాధితులందర్నీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

కొత్వాల్‌ గూడ ఎకో పార్క్‌ నిర్మాణంతో చుట్టుపక్కల ఉన్న అన్ని వర్గాలకు లాభం జరుగుతుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మూసీ పరివాహకాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసే క్రమంలో.. నైట్‌ టూరిజాన్ని ప్రమోట్‌ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల టూరిస్టులు వచ్చేలా ఆహ్లాదకరమైన నగరాన్ని నిర్మించుకునే ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ప్రజలు ఎవరూ మురికిలో బతకాలను కోరుకోరు. విధిలేక మురికికూపాల్లో నివసిస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలన్నారు. పేదల గురించి ఆలోచించి అందరినీ మెప్పించి, ఒప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తామన్న సీఎం.. ఎక్కడ ఉన్న వాళ్లకు అక్కడే ఇండ్లు కట్టించడానికి ఏర్పాటు చేస్తామన్నారు.

మొత్తంగా.. హైదరాబాద్‌ సిటీ డెవలెప్‌మెంట్‌ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.. భారత్‌ ఫ్యూచర్‌ సిటీతో పాటు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలెప్‌మెంట్‌ వ్యూను ప్రజల కళ్లకు కట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *