
హార్ముజ్ జలసంధిలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా నిలిచిపోయినప్పటికీ, ఆ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం వేగంగా స్పందించింది. హార్ముజ్ జలసంధితో సంబంధం లేని ఇతర రూట్ల ద్వారా చమురు దిగుమతులను ఇప్పటికే ప్రారంభించింది. అంతేకాకుండా, దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చమురు కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. అయితే, గ్యాస్ కొరత దృష్ట్యా కమర్షియల్ సిలిండర్ల పంపిణీపై కఠిన నిబంధనలు విధించింది. కొన్ని రోజుల పాటు హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా నిలిపివేయాలని నిర్ణయించడంతో వ్యాపార రంగంపై ప్రభావం పడుతోంది. సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రభుత్వం ‘ఎస్మా’ చట్టాన్ని కూడా అమలు చేస్తోంది. మరోవైపు ధరల సెగ సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తోంది. గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 60, కమర్షియల్ సిలిండర్‌పై రూ. 115 చొప్పున కేంద్రం పెంచింది. యుద్ధం ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా, సరఫరా మెరుగుపడుతుందన్న కేంద్రం ప్రకటనతో ప్రజలకు కొంత ఊరట లభించినట్లయింది.
మరిన్ని వీడియోల కోసం :
